కరువు సాయానికి నిధులేవి?`

  • 365 కరువు మండలాలను ప్రకటించిన ప్రభుత్వం
  • 111 తీవ్ర, 254 మోస్తరు కరువు మండలాలుగా గుర్తింపు
  • కరువు మండలాలపై సర్కారు మల్లగుల్లాలు
  • కేంద్రం సాయం చేయకుంటే పైసలెట్ల?
  • పంట నష్టపోయి ఆందోళనలో అన్నదాతలు
  • పట్టణాల్లో తాగునీటి ఎద్దడి
  • ప్రత్యామ్నాయ నిధుల సమీకరణపై సర్కార్‌ ఫోకస్‌
  • రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం కోసం అధికారుల ఎదురుచూపులు

కేంద్ర సాయం అనుమానమే…?!

రాష్ట్ర ప్రభుత్వం కరువు మండలాలు ప్రకటించినా, కేంద్రం నుంచి ఆశించిన స్థాయిలో నిధులు వచ్చే అవకాశాలు కనిపించట్లేదు. ఇప్పటివరకు కేంద్రం నుంచి వివిధ స్కీంలు, ప్రోత్సాహకాలు, బడ్జెట్‌ ‌కేటాయింపుల రూపంలో రావల్సిన నిధుల్లో 25 శాతం కూడా రాలేదని ఇప్పటికే ‘కాగ్‌’ ఆక్షేపించిన విషయం తెలిసిందే. అయితే కేంద్ర ప్రభుత్వ విపత్తు నిర్వహణ సమాచార వ్యవస్థ (ఎన్‌డీఎంఐఎస్‌), 16వ ఆర్థిక సంఘం నివేదిక ప్రకారం 2026–27 నుంచి 2030–31 వరకు తెలంగాణకు రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన నిధి (ఎస్‌డీఆర్ఎఫ్‌) కింద రూ.2,959 కోట్లు కేటాయించాలని సిఫారసు చేశారు. ఇందులో 2026–27 సంవత్సరానికి రూ.536 కోట్లు ఉన్నాయి. అయితే వీటి విడుదలకు కేంద్రం అనుమతి ఇస్తుందా లేదా అనేది తేలాల్సి ఉంది!!

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు