కోల్‌కతాలో దారుణం.. ప్రేమ వ్యవహారంతో ముగ్గురిని నగ్నంగా ఊరేగింపు..

పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో 18 ఏళ్ల యువకుడు, అతడి తండ్రి, స్నేహితుడిపై దాడి చేసి నగ్నంగా ఊరేగించిన ఘటన కలకలం రేపింది. ఈ ఘటనలో 13 ఏళ్ల బాలిక తల్లిదండ్రులు, మామను పోలీసులు అరెస్ట్ చేశారు.ఆదివారం బాలికను ఆమె మామ యువకుడితో కలిసి ఉండగా చూసినట్లు సమాచారం. ఈ విషయం బాలిక తండ్రికి చెప్పడంతో ఇద్దరు యువకులను ఇంటికి తీసుకెళ్లి దాడి చేసినట్లు ఆరోపణలు వినవస్తున్నాయి .

యువకుడితో అతడి తండ్రిని ఇంటికి పిలిపించి కొట్టినట్లు పోలీసులు తెలిపారు. ముగ్గురూ బట్టలు విప్పకపోతే తుపాకీతో కాల్చేస్తామని బెదిరించి, ఇంటి బయట సుమారు 50 మీటర్ల దూరం నగ్నంగా నడిపించినట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది.

బాధితుడి తండ్రి ఫిర్యాదుతో హత్యాయత్నం, అక్రమ నిర్బంధం, కిడ్నాప్, క్రిమినల్ బెదిరింపులు సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇది ఇలా ఉంటే ముగ్గురు బాధితులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. తుపాకీతో బెదిరించారని వారు ఫిర్యాదు చేయగా, ఆయుధం ఇంకా లభించలేదు. సీసీటీవీ ఫుటేజీని పరిశీలించిన పోలీసులు, ఇతర నిందితుల కోసం గాలిస్తున్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు