ఎటపాక కూటమి జెడ్పీటీసీ అభ్యర్థి ఉబ్బా సుస్మిత విజయానికి కృషి చేస్తాం – కుంజా ధర్మా, కుంజా సంతోష్!

ఏపీ…. ఎటపాక…. D వినేష్…

ఎటపాక మండల జెడ్పీటీసీ ఎన్నికల్లో బీజేపీ–టీడీపీ–జనసేన కూటమి అభ్యర్థి ఉబ్బా సుస్మితను ఎయిర్ కండిషనర్ (ఏసీ) గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని భద్రాచలం బీజేపీ నాయకులు కుంజా ధర్మా, కుంజా సంతోష్ భద్రాచలం పట్టణంలో నివసిస్తున్న ఎటపాక మండల ఓటర్లకు పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా గంగారం గ్రామంలో అభ్యర్థి ఉబ్బా సుస్మిత నివాసం వద్ద నిర్వహించిన సమావేశంలో రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శిరీష, ఆంధ్రప్రదేశ్ శెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్, కూటమి ఎన్నికల పరిశీలకుడు సత్తిబాబు పాల్గొన్నారు. ఈ సమావేశంలో పాల్గొన్న బీజేపీ నాయకులు ఉబ్బా సుస్మితకు జెడ్పీటీసీ అభ్యర్థిగా అవకాశం లభించిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసి, ఆమె విజయానికి తమ సంపూర్ణ మద్దతును ప్రకటించారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, ఎయిర్ కండిషనర్ (ఏసీ) గుర్తుపై ఓటు వేసి బీజేపీ–టీడీపీ–జనసేన కూటమి అభ్యర్థి ఉబ్బా సుస్మిత విజయానికి పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేయాలని, భద్రాచలం పట్టణంలో నివసిస్తున్న ఎటపాక మండల ఓటర్లను కలిసి అభ్యర్థికి మద్దతు కూడగట్టాలని పిలుపునిచ్చారు. కూటమి నాయకులు, కార్యకర్తలు నవంబర్ 3 వరకు పగలు రాత్రి తేడా లేకుండా అహర్నిశలు కృషి చేసి నవంబర్ 5న జరగనున్న ఎన్నికలలో అభ్యర్థి విజయానికి తోడ్పడాలని సూచించారు. ఎటపాక మండల అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం, ప్రజలకు మెరుగైన సేవలు అందించాలనే లక్ష్యంతో కూటమి అభ్యర్థికి ప్రజలు మద్దతు ఇవ్వాలని నాయకులు కోరారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు