ఈటల మహా పాదయాత్ర.. జవహర్‌నగర్ డంపింగ్‌ యార్డు తరలింపుపై సమరం!

జవహర్‌నగర్ డంపింగ్ యార్డ్‌ను వెంటనే తరలించాలని డిమాండ్ చేస్తూ మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ చేపట్టిన మహా పాదయాత్ర నాలుగో రోజుకు చేరింది. గత 30 ఏళ్లుగా రోజుకు సుమారు 10,000 మెట్రిక్ టన్నుల వ్యర్థాల వల్ల పరిసర ప్రాంతాల ప్రజల ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింటోందని, ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించే వరకు బీజేపీ ఆధ్వర్యంలో పోరాటం ఆపేది లేదని ఆయన స్పష్టం చేశారు. తాను పనిలేక తిరుగుతున్నానంటూ విమర్శిస్తున్న కాంగ్రెస్ నాయకులకు ఈటల ఘాటుగా సమాధానమిచ్చారు. ఈ డంప్ యార్డు మాత్రమే కాదు, ప్రజల పక్షాన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చే వరకు తాను తిరుగుతూనే ఉంటానని ఆయన తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఈ భారీ పాదయాత్రలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాల్గొని మద్దతు తెలిపారు. కాగా నేడు పాదయాత్ర ముగింపు సందర్భంగా సాయంత్రం భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు