ధాన్యం మద్దతు ధరపై భగ్గుమన్న అన్నదాతలు..

• తిరుమలగిరి మార్కెట్ ఎదుట రాస్తారోకో…

ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించాలంటూ సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ ఎదుట రైతాంగం కన్నెర్రజేసింది. మార్కెట్ ప్రధాన ద్వారం ఎదుట రహదారిపై బైఠాయించి పెద్ద ఎత్తున రాస్తారోకో నిర్వహించడంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయి, కిలోమీటర్ల మేర భారీగా ట్రాఫిక్ స్తంభించింది.

రెండు రోజుల క్రితం వరకు క్వింటాలుకు రూ.3,600 పలికిన ధరను ఒక్కసారిగా రూ.2,500కు తగ్గించడంపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మిల్లర్లు అంతా కుమ్మక్కై సిండికేట్‌గా మారి, చెమటోడ్చి పండించిన పంటను నిలువునా దోచుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని ధాన్యానికి కనీస మద్దతు ధరను రూ.4,000గా నిర్ణయించాలని, మిల్లర్ల దోపిడీకి అడ్డుకట్ట వేసి అన్నదాతలను ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు.దళారులు సిండికేట్‌గా ఏర్పడి రైతులను ముంచుతున్నారని ఆవేదన వ్యక్తం చేసిన రైతులు, రాస్తారోకోతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు