బియ్యం ధరలు పెరగకుండా, సామాన్యులకు అందుబాటులో ఉండేలా పౌర సరఫరాల శాఖ కమిషనర్ ఎం. స్టీఫెన్ రవీంద్ర ఆదేశాలతో హైదరాబాద్‌లో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. పౌర సరఫరాల శాఖ డైరెక్టర్ జి.వి. శ్యామ్ ప్రసాద్ లాల్ నేతృత్వంలో మిర్యాలగూడ, నిజామాబాద్, నల్గొండ ప్రాంతాల రైస్ మిల్లర్లు, హోల్‌సేల్ వ్యాపారులతో చర్చించారు.
గత సీజన్‌కు చెందిన బియ్యం నిల్వలే ప్రస్తుతం మార్కెట్లో ఉన్నందున.. ధరలను అమాంతం పెంచొద్దని అధికారులు స్పష్టం చేశారు. కృత్రిమ కొరత సృష్టించినా, అక్రమంగా గోదాముల్లో బియ్యం నిల్వ చేసినా చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మార్కెట్ పరిస్థితులను బట్టి ప్రభుత్వం ప్రత్యేక బియ్యం విక్రయ కౌంటర్లు ఏర్పాటు చేయనుంది. వాటికి ఎలాంటి అంతరాయం లేకుండా బియ్యం సరఫరా చేయాలని మిల్లర్లకు సూచించింది.
Post Views: 24









