ఎల్ నినో ఎఫెక్ట్ తో హైదరాబాదు మహానగరంలో నీటి కొరత ఏర్పడిందని భూగర్భ జలాలు తగ్గటంతో ప్రజలు నీటిని పొదుపుగా వాడాలని త్రాగునీటిని వృధా చేయరాదని ప్రభుత్వం నిబంధనలు విధించినా లక్ష్యపెట్టక భవనం గోడలు, షెడ్డుని కడిగి తాగునీటిని వృధా చేశారన్న ఆరోపణలపై.. ప్యారడైజ్ రెస్టారెంట్‌కు HMWSSB రూ.20 వేల జరిమానా విధించారు.
తాగునీటిని దుర్వినియోగం చేసినందుకు సికింద్రాబాద్ హోటల్ ప్యారడైజ్ యాజమాన్యానికి జలమండలి రూ.20 వేల జరిమానా విధించింది.ఖైరతాబాద్ జోన్ పరిధిలోని డివిజన్-16 అధికారులు నిర్వహించిన తనిఖీల్లో హోటల్ ప్యారడైజ్‌లో (CAN నంబర్: 612182839) నీటి దుర్వినియోగాన్ని గుర్తించారు. దీంతో రూ.20 వేల జరిమానా విధించడంతో పాటు భవిష్యత్తులో నీటిని వృథా చేయకుండా పొదుపుగా వినియోగించాలని యాజమాన్యానికి సూచించారు.నీటి దుర్వినియోగానికి పాల్పడితే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని జలమండలి అధికారులు హెచ్చరించారు.

ఖైరతాబాద్ జోన్ పరిధిలోని డివిజన్-16 అధికారులు తనిఖీలు నిర్వహించగా.. రెస్టారెంట్ యాజమాన్యం నీటిని వృథా చేస్తున్నట్టు గుర్తించారు.ఈ నేపథ్యంలోనే రూ.20 వేల జరిమానా విధించి.. భవిష్యత్తులో నీటిని పొదుపుగా వాడాలని అధికారులు హోటల్ యాజమాన్యానికి సూచనలు చేశారు.అయితే.. అంత పెద్ద రెస్టారెంట్‌కు కేవలం రూ.20 వేల జరిమానా మాత్రమే విధించడంపై విమర్శలు వెళ్లువెత్తుతున్నాయి.
ఇతర సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటూ.. కొన్ని వాణిజ్య సంస్థల పట్ల అధికారులు మెతకగా వ్యవహరిస్తున్నారా అనే ప్రశ్నలు తెరమీదకు వస్తున్నాయి..ఇటీవల జూబ్లీహిల్స్‌లోని ఫాదర్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా విధించడంతో పాటు నీటి కనెక్షన్ అధికారులు తొలగించిన సంగతి తెలిసిందే.కాగా .. ప్యారడైజ్ విషయంలో రూ.20,000 జరిమానాకు మాత్రమే పరిమితం కావడంతో, అధికారుల తీరుపై విమర్శలు వస్తున్నాయి.









