బియ్యం ధరలకు అమాంతం రెక్కలు…
రైతులకు గిట్టుబాటు ధర ఏమోగాని బహిరంగ మార్కెట్లో బియ్యానికి డిమాండ్ పెంచేసి ధరలు కొండెక్కిస్తున్న వ్యాపారులు, మధ్య దళారులు. ..
తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో తీవ్ర వర్షాభావం నెలకొన్న పరిస్థితులలో … సాగు విస్తీర్ణం తగ్గిన నేపథ్యంలో ఆయకట్టు తగ్గడం, మరోవైపు జలాశయాల్లో నీటి కొరతతో రెండో పంట (రబీ) సాగు అవకాశాలపై తీవ్ర అనిశ్చితి ఏర్పడింది. ఎల్ నినో, కరువు పరిస్థితుల వల్ల పంట విస్తీర్ణం, దిగుబడి తగ్గిపోయాయి. పైరమీద ఉన్న పంట ఎంత దిగుబడి వస్తుందో తెలయని అయోమయ స్థితి రైతులలో నెలకొంది, గోదావరి డెల్టాలో మినహా రెండో పంట అయితే లేదని తేలిపోయింది, .
తెలంగాణ, ఆంద్రప్రదేశ్, కర్నాటక, మహారాష్ర్టలలో పరిస్థతి అధ్వాన్నంగా ఉంది. ఇదే అదునుగా వ్యాపారులు, దళారులు డిమాండ్ పెంచేశారు. అందుకు తగిన విధంగా సేకరణ ప్రారంభించేశారు. ప్రాజెక్టుల కింద పంట చేతికి రావటానికి . ఇంకా దాదాపు నెల పొట్టి అవకాశం ఉండగా . ఇప్పటికైతే బోర్లు, పంపుసెట్ల కింద సాగు చేసిన వరి చేతికి వస్తోంది. దళారులు, వ్యాపారులు ఇదే అదునుగా భావించి మార్కెట్ లో డిమాండ్ పెంచేసి సొమ్ముచేసుకుంటున్నారని సామాన్య ప్రజలు భావిస్తున్నారు. కాగా రైతుల కన్నా వ్యాపారులకే ఎక్కువ గిట్టుబాటు అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయనే వాదన సైతం లేకపోలేదు . మార్కెట్ ఎకానమీ. ఉత్పత్తి ఆధారిత మార్కెటింగ్ కాకపోవటంతో మరీ ముఖ్యంగా వ్యవసాయానికి వచ్చేసరికి,ఇప్పటికే ప్రీమియం వరి ధాన్యానికి కనీస మద్దతు ధర కంటే క్వింటాలుకు రూ.1,000కు పైగా అదనపు ధర లభిస్తోంది. మార్కెట్లో బియ్యం ధరలు పెరిగిపోతున్నాయి. సోనామసూరి 70 రూపాయల నుంచి 90 రూపాయిలు దాటింది. కొన్ని ప్రాంతాల్లో వంద రూపాయిలు పలుకుతున్నాయి.
కొత్త పంట ఇంకా పూర్తిస్థాయిలో మార్కెట్‌కు రాకముందే పెరుగుతున్న ధరలు!
ఆయకట్టు తగ్గిన నేపథ్యంలో, దిగుబడులపై ఆందోళన , రబీ సాగుకు నీటి కొరత… రాబోయే నెలల్లో ధాన్యం సరఫరా తగ్గవచ్చన్న అంచనాలు ధరలను ప్రభావితం చేస్తున్నాయి.రైతులకు అధిక ధరలు ఊరట కలిగించినా… దిగుబడులు తగ్గితే ప్రయోజనం ఎంత? మరోవైపు బియ్యం ధరల పెరుగుదలతో వినియోగదారులపై భారం పడే ప్రమాదం లేకపోలేదు.
రైతుకు గిట్టుబాటు… వినియోగదారుడికి అందుబాటు… రెండూ సవాళ్లే!
తాజా మార్కెట్ కథనం ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్ల వ్యవసాయ మార్కెట్లో బీపీటీ రకం వరి ధాన్యం క్వింటాలుకు రూ.3,600 నుంచి రూ.4,500 వరకు ధర పలుకుతోంది.బాపట్లలో క్వింటాలు రూ.4,500… కర్ణాటకలో రూ.5,200 పలుకుతోంది అయితే కర్ణాటకలోని కొన్ని వ్యవసాయ మార్కెట్లలో వరి ధాన్యం ధర క్వింటాలుకు రూ.5,200 వరకు చేరినట్లు వ్యాపార వర్గాలు వెల్లడించాయి.
2026–27 మార్కెటింగ్ సీజన్‌కు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన గ్రేడ్-A వరి ధాన్యం కనీస మద్దతు ధర రూ.2,461 మాత్రమే కావడం గమనార్హం .అంటే బాపట్లలో నమోదైన గరిష్ఠ ధరతో పోలిస్తే క్వింటాలుకు రూ.2,039 అదనంగా లభిస్తోంది. అయితే ఈ ధర అన్ని రకాల ధాన్యానికి లేదా రైతులందరికీ వర్తించక పోవటమనేది నిర్వివాదాంశం . నాణ్యత, తేమ శాతం, రకం, మార్కెట్ డిమాండ్ ఆధారంగా ధర మారుతుందని వ్యాపార వర్గాలు తెలియజేస్తున్నాయి.కాగా మద్దతు ధర రైతుకు కనీస రక్షణ కల్పించేందుకు ఉద్దేశించినది. మార్కెట్లో డిమాండ్ పెరిగితే అంతకంటే ఎక్కువ ధర లభించవచ్చు లేదా వ్యాపారులు లాభపడవచ్చు.









