గోదావరిలో నీటిమట్టం తగ్గడంతో పట్టిసీమ ఎత్తిపోతల పథకం మోటార్లను అధికారులు నిలిపివేసినట్లు సమాచారం. పంపింగ్‌కు అవసరమైన కనీస నీటిమట్టం +14 మీటర్లు కాగా, నీటిమట్టం ఆ స్థాయికి పడిపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.అక్టోబర్ 25 నాటికి 10 మోటార్ల ద్వారా 3,540 క్యూసెక్కుల నీటిని తరలించగా, అప్పటివరకు మొత్తం 67.81 టీఎంసీల నీటిని ఎత్తిపోశారు. తాజా సమాచారం ప్రకారం ఈ సీజన్లో సుమారు 68 టీఎంసీల గోదావరి జలాలను కృష్ణా డెల్టాకు తరలించారు.
అయితే, పట్టిసీమ మోటార్లు నిలిచిపోయినప్పటికీ ప్రకాశం బ్యారేజీ నుంచి #కృష్ణా డెల్టాకు నీటి విడుదల కొనసాగుతోంది.ముఖ్యంగా: అక్టోబర్ 26 బ్యారేజీ నివేదికలో పట్టిసీమ మోటార్ల తాజా స్థితి సమాచారం ఇంకా అందలేదు. ఇప్పుడు ‘ అర్నబ్ ’ తుపాను ప్రభావంతో గోదావరి పరీవాహక ప్రాంతంలో వర్షాలు కురిసి, నీటిమట్టం తిరిగి పెరిగితే పట్టిసీమ పంపింగ్ పునరుద్ధరణకు అవకాశం ఉంటుందని అధికారులు తెలియజేస్తున్నారు .









