లేడీ సింగం జార్జి మెలోని

యూరోపియన్ యూనియన్‌లో ఎవరూ చేయలేని పనిని కేవలం 24 గంటల్లో చేసి చూపించిన ఇటలీ ప్రధాని జార్జియా మెలోని…

ఇటలీలో అల్లర్లను ఆపడానికి మెలోని తీసుకొచ్చిన ఒక కొత్త పాలసీతో మొత్తం యూరప్ అంతా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. స్టూడెంట్స్ పేరిట జరిగే హింసాత్మక నిరసనలకు చెక్ పెట్టేందుకు ఆమె ఒక సాలిడ్ బ్లూప్రింట్‌ను బయటకు తీశారు… అదే ‘ది యాంటీ-రైట్ డాక్ట్రిన్’,”రోడ్లెక్కి గొడవలు చేసి విధ్వంసం సృష్టిస్తే… మీ అమ్మానాన్నల బ్యాంక్ అకౌంట్లను ఖాళీ చేసేస్తాం అంటూ ఇటలీ ప్రధాని మెలోని సూటిగా చెప్పారు.

ఎవరైనా హింసాత్మక నిరసనల్లో పాల్గొంటే, వారికి 5 ఏళ్ల జైలు శిక్షతో పాటు ఏకంగా 20,000 యూరోల (దాదాపు ₹18 లక్షల రూపాయల) జరిమానా విధిస్తామని ఇటలీ ప్రధాని కఠిన నిబంధనను తెరపైకి తీసుకురావటం గమనార్హం. ఇది ఇలా ఉంటే,విదేశీ నిధులతో ముసుగులు వేసుకొని వచ్చే అల్లరి మూకలను కేవలం బాష్పవాయువు (Tear Gas) ప్రయోగించి ఆపలేమని ఆమె గ్రహించారు. వారి వెనుక ఉన్న లాజిస్టిక్స్, ఫైనాన్షియల్ సపోర్ట్‌ను దెబ్బకొట్టాలని గట్టిగా నిర్ణయించుకున్నారు.ప్రధాని మెలోని.

కాగా ఎప్పుడైతే అల్లరిమూకల తల్లిదండ్రులపై భారీ జరిమానాలు వేయడం మొదలుపెట్టారో, అలాగే మిలాన్ నగరంలోకి 500 మంది సైనిక బలగాలను దింపారో… ఒక్కసారిగా రోడ్లపై ఉన్న ఆ యూత్ యాక్టివిస్టులంతా ఎక్కడికి మాయమైపోయారో, ఏ కలుగుల్లో దాక్కున్నారో ఎవరికీ అర్థం కాలేదు.అయితే కోటీశ్వరులు ఎన్జీవోలకి ఫండింగ్ ఇచ్చి, యువతను హ్యూమన్ షీల్డ్స్ (మానవ కవచాలు)గా వాడుకుంటూ స్వతంత్ర దేశాలను అస్థిరపరచాలనే ‘న్యూ వరల్డ్ ఆర్డర్’ కుట్రలకు ఇది గట్టి కౌంటర్ స్ట్రైక్ అనే చెప్పాలి.

ఆశ్చర్యకర విషయం ఏమిటంటే నిరసనల ముసుగులో ఉన్న ఆర్థిక, చట్టపరమైన లొసుగులను మూసివేసినప్పుడు, విప్లవాల పేరుతో డ్రామాలు ఆడేవాళ్ళ అసలు రంగు బయటపడింది.హక్కుల పేరుతో హైవేలను దిగ్బంధించడం, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం లేదా తగులబెట్టడం లాంటివి చేస్తే… ఆ నష్టపరిహారం తాలూకు బిల్లు నేరుగా ఆ అల్లరి మూకల ఇళ్లకే పంపించాలి అంటూ ఈ విషయం తెలిసిన సగటు భారతీయుడు అభిప్రాయపడుతున్నాడు.దేశాన్ని బందీగా మార్చడం ప్రజాస్వామ్యం అనిపించుకోదని , నిరసన తెలిపే హక్కు అందరికీ ఉంటుంది, కాగా దానికి కూడా ఒక పద్ధతి ఉంటుందని మరికొందరు వ్యాఖ్య్యానిస్తున్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు