స్కూల్‌లో క్లోరోక్విన్ మాత్రలు పంపిణీ చేయటం తో .. విద్యార్థిని మృతి చెందిన ఘటన భద్రాచలం శివారు ప్రాంతమైన ఆంధ్రప్రదేశ్ పోలవరం జిల్లాలో చోటుచేసుకుంది.
భద్రాచలం సరిహద్దులోని ఏపీ రాష్ట్రం పోలవరం జిల్లా ఎటపాక మండలం విసాపురం- గొల్ల గొప్పలో ఈ ఘటన వెలుగు చూసింది.పాఠశాలలోని 73 మంది విద్యార్థులకు స్కూల్ సిబ్బంది క్లోరోక్విన్ మాత్రలు పంపిణీ చేయగా,ఆ మాత్రలు వేసుకున్నాక విద్యార్థిని మృతి చందగా .. మరో 20 మందికి అస్వస్థతకు గురైనట్టు సమాచారం అందుతోంది.
దాంతో స్కూల్ సిబ్బంది అస్వస్థతకు గురైన విద్యార్థులను చికిత్స నిమిత్తం హుటాహుటిన భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించినట్టు తెలియ వచ్చింది. కాగా చికిత్స పొందుతున్న వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం.. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
పోలవరం జిల్లా, ఎటపాక మండలం గొల్ల గుప్ప గ్రామంలో విషాద సంఘటన చోటు చేసుకుంది … మలేరియా క్లోరోఫిన్ టాబ్లెట్లు…వికటించటంతో విద్యార్థులు అస్వస్థతకు గురి అయ్యారు.
అనారోగ్యానికి గురైన 28 మంది చిన్నారులను … మెరుగైన వైద్యం కోసం భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు ….
మలేరియా టాబ్లెట్లు వికటించటం వల్లే తన కూతురు మరణించింది అని మడివి జమున తండ్రి…ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి చేరిన చిన్నారులకు భద్రాచలం ఏరియా ఆసుపత్రి సిబ్బంది వైద్యులు.. వైద్య చికిత్స అందిస్తున్నారు.
ఇది ఇలా ఉండగా కొన్ని రోజుల క్రితం ఓ అమ్మాయి మలేరియా బారిన పడగా .. చికిత్స కోసం ఆసుపత్రికి వెళ్లొచ్చింది అప్పుడు నర్సులు గ్రామాన్ని సందర్శించి అందరికీ చెకప్స్ నిర్వహించారు స్కూల్ వద్దకు వెళ్లి విద్యార్థులకు కొన్ని మాత్రలు ఇచ్చారు
టాబ్లెట్ వేసుకున్న అనంతరం పాఠశాల నుంచి వచ్చిన పాప కళ్లు తిరుగుతున్నాయని చెప్పి అపస్మారక స్థితిలోకి వెళ్లిందికొద్దిసేపయ్యాక మాటలు కూడా రాకపోవడంతో.. వెంటనే పాపను ఆసుపత్రికి తీసుకెళ్లామని, కాగా .. అప్పటికే చిన్నారి ప్రాణాలు కోల్పోయిందని వైద్యులు చెప్పారని,మృతి చెందిన విద్యార్థిని బంధువులు తెలిపారు.
సంఘటన జరిగిన విషయం తెలుసుకుని భద్రాచలం ఏరియా ఆసుపత్రిని హుటాహుటిన సందర్శించి.. ఏపీలోని చింతూరు ఐటీడీఏ పీవో, ఏఎస్పీలు పిల్లల పరిస్థితిని పరిశీలించారు… మెరుగైన చికిత్స అందించవలసిందిగా ఏరియా ఆసుపత్రి వైద్యులకు సూచించారు…









