BRS నాయకుల విమర్శలకు కాంగ్రెస్ నేతల ఘాటైన కౌంటర్…

. పార్టీపై, భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావుపై BRS నాయకులు చేస్తున్న అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని భద్రాచలం సర్పంచ్ పూనం కృష్ణ, తెలంగాణ రాష్ట్ర పెరిక కార్పొరేషన్ డెవలప్మెంట్ వైస్ చైర్మన్ బుడగం శ్రీనివాస్ లు అన్నారు.

నవాబు అనే వ్యక్తికి కాంగ్రెస్ పార్టీతో ఎలాంటి సంబంధం లేదని, పార్టీకి నచ్చని కారణంగానే అతడిని తొలగించామని వారు స్పష్టం చేశారు. అలాగే భరత్‌కు కూడా కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వం లేదని, అతనికి కాంగ్రెస్ పార్టీతో ఎలాంటి సంబంధం లేదని తెలిపారు.

ఇది ఇలా ఉంటే ఎమ్మెల్యేకు సీసీగా కళ్యాణ్ ని నియమించింది మీ పార్టీ ఎమ్మెల్సీ తాతా మధు కాదా?” అని ప్రశ్నించారు. ఈ విషయంలో వాస్తవాలు తెలుసుకోకుండా కాంగ్రెస్ పార్టీపై, ఎమ్మెల్యేపై ఆరోపణలు చేయడం సరికాదని హితవు పలికారు .

పంచాయతీ ఎన్నికల్లో 20 వార్డుల్లో కేవలం ఒక్క వార్డు మాత్రమే గెలిచిన వారు, ప్రజల మద్దతుతో ఎన్నికైన ఎమ్మెల్యేను విమర్శించడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు.

పదేళ్లు అధికారంలో ఉన్న సమయంలో భద్రాచలం అభివృద్ధికి ఒక్క రూపాయి కూడా తీసుకురాలేని మీరు.. ఇప్పుడు భద్రాచలం అభివృద్ధి పరుగులు పెడుతుంటే విమర్శలు చేయడం విడ్డూరంగా ఉంది” అని అన్నారు.

భద్రాచలంలో సెటిల్మెంట్లు, దందాలు ఎవరు చేశారో నియోజకవర్గ ప్రజలకు తెలుసని అన్నారు. గతంలో ఇసుక ర్యాంపు వ్యవహారంలో గ్రామ ప్రజలు ఎలా వ్యతిరేకించారో కూడా ప్రజలకు గుర్తుందని తెలిపారు. “మీరు మీ పార్టీ మర్చిపోయినా ప్రజలు మర్చిపోలేదు” అని అన్నారు.

మా ఎమ్మెల్యే 25 వేల ఓట్లతో ఓడిపోవడం కాదు.. మీ పార్టీకి వచ్చే ఎన్నికల్లో డిపాజిట్లు కూడా దక్కవు”అంటూ ఘాటుగా స్పందించారు. భద్రాచలం నియోజకవర్గ ప్రజల సమస్యలపై రాజకీయాలు చేయాలని, ఇతర నియోజకవర్గాల నుంచి వచ్చే స్క్రిప్టులను మీడియా ముందు చదివే రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు.

ప్రజల శుభకార్యాలకు ఎమ్మెల్యేను ఆహ్వానించడం భారతీయ సంస్కృతిలో సహజమైన విషయమని, వాటిని కూడా రాజకీయ కోణంలో చూసి విమర్శించడం ద్వారా ప్రజల పట్ల వారి గౌరవం ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోందన్నారు.

అలాగే గతంలో తమ పార్టీ కార్యాలయ పరిస్థితిపై ప్రజలకు అన్నీ తెలుసని, అలాంటి వారు నేడు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని మండిపడ్డారు.

కాంగ్రెస్ పార్టీ జోలికి వచ్చినా.. ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావుపై అనుచిత వ్యాఖ్యలు చేసినా సహించేది లేదు. ఇకనైనా ఆధారాలు లేని ఆరోపణలు, వ్యక్తిగత విమర్శలు మానుకోవాలన్నారు . ప్రజల కోసం నిర్మాణాత్మక రాజకీయాలు చేయాలి. లేదంటే ప్రజలే తగిన సమాధానం చెబుతారు. ఖబడ్దార్ అంటూ కాంగ్రెస్ పార్టీ నాయకులు హెచ్చరించారు

ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు రత్నం రమాకాంత్,కొండిశెట్టి కృష్ణమూర్తి, బొంబోతుల రాజీవ్, నర్రా రాము, అరికెల్ల తిరుపతిరావు, భీమవరపు వెంకటరెడ్డి, పెద్దినేని శ్రీనివాస్, చింతాడి చిట్టిబాబు, తాళ్ళపల్లి రమేష్ గౌడ్, చాట్ల రవి కుమార్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నాయకులు పిలక వెంకటరమణరెడ్డి, 12వ వార్డు సభ్యులు కారం దుర్గారావు, యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ వైస్ ప్రెసిడెంట్ గాడి విజయ్, యూత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు