పదవీ విరమణ పొందిన ముగ్గురు పోలీసు అధికారులకు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు చే ఘన సన్మానం…

మణుగూరు ఆగస్టు 31..Today9TVNews ప్రతినిధి, D రమేష్

మణుగూరు… పోలీస్ శాఖలో సుదీర్ఘకాలం పాటు నిబద్ధతతో విధులు నిర్వహిస్తూ ప్రజలకు విశిష్ట సేవలందించి పదవీ విరమణ పొందిన ముగ్గురు పోలీసు అధికారులను జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ సోమవారం నాడు జిల్లా పోలీసు కార్యాలయంలో ఘనంగా సత్కరించారు.


ఈ సందర్భంగా 37 సంవత్సరాల పాటు పోలీసు శాఖలో సేవలందించిన ఏఎస్ఐ పసునూరి నాగరాజు, ఏఎస్ఐ షేక్ మహబూబ్ అలీ, ఏఎస్ఐ చాచు వెంకటేశ్వర్లు పదవీ విరమణ పొందారు. వీరిని జిల్లా ఎస్పీ శాలువాలు కప్పి, పూలమాలలు వేసి ఘనంగా సన్మానించి ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా పదవీ విరమణ పొందిన అధికారులు తమ పోలీసు సేవా అనుభవాలను పంచుకున్నారు.

జిల్లా ఎస్పీ మాట్లాడుతూ పదవీ విరమణ అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా, ఆరోగ్యంగా జీవించాలని ఆకాంక్షించారు. వ్యాయామం, యోగా, ధ్యానం వంటి ఆరోగ్యకరమైన అలవాట్లను కొనసాగించాలని సూచించారు.


పదవీ విరమణ పొందిన అధికారులకు ఎలాంటి సమస్యలు ఎదురైనా జిల్లా పోలీసు శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, ప్రభుత్వం నుంచి రావాల్సిన పదవీ విరమణ ప్రయోజనాలు సకాలంలో అందేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో డిసిఆర్బి డిఎస్పి మల్లయ్య స్వామి, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ మంజ్య నాయక్, ఎస్బి ఇన్స్పెక్టర్ ఇ. శ్రీనివాస్, ఆర్ఐ కృష్ణారావు, పోలీసు అధికారుల సంఘం సభ్యులు, పదవీ విరమణ పొందిన అధికారుల కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు