భద్రాచలం : ఆగస్టు 31 : TODAY9
హైదరాబాద్ తుక్కుగూడలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఆదివాసీ యువతి ఊకే శిరీషకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ భద్రాచలంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు.
భద్రాచలం పట్టణంలో అంబేద్కర్ సెంటర్ నుంచి బ్రిడ్జి సెంటర్ వరకు కొవ్వొత్తుల ర్యాలీలో ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు భద్రాచలం మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ పూనెం కృష్ణ , వివిధ పార్టీల నాయకులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ప్రజలు, మహిళలు, యువత, వివిధ సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
“శిరీష కుటుంబానికి న్యాయం చేయాలి…నిజాలు నిగ్గు తేల్చాలి…బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి …అంటూ నినాదాలు చేస్తూ ఆదివాసీ ఆడబిడ్డ శిరీషకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని ర్యాలీలో పాల్గొన్న వారు స్పష్టం చేశారు.
Post Views: 38









