ఆదివాసీ మహిళ ఊకే శిరీష మృతిపై సమగ్ర విచారణ జరిపించాలి..


• భద్రాచలం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసన.

.
•ఆదివాసీ మహిళ ఊకే శిరీష మృతిపై సమగ్ర విచారణ జరిపించాలి: న్యాయవాదుల డిమాండ్..


​భద్రాచలం: సెప్టెంబర్ 2: TODAY9…

శిరీష మృతి వెనుక ఉన్న నిజానిజాలను వెంటనే వెలికితీసి, బాధిత కుటుంబానికి పరిపూర్ణ న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ భద్రాచలం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భద్రాచలం జ్యూడిషల్ మేజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ మరియు అడిషనల్ జ్యూడిషల్ మేజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ కోర్టుల మెయిన్ గేటు ముందు న్యాయవాదులు బృహత్ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు.


​ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షులు కొడాలి శ్రీనివాసన్ మాట్లాడుతూ:, ఒక పేద ఆదివాసీ కుటుంబానికి చెందిన మహిళ నర్సుగా సమాజానికి సేవలందిస్తూ, ఇలా అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోవడం అత్యంత దారుణమని అన్నారు . ఈ కేసులో ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా, ఎలాంటి ప్రభావాలకు లోనుకాకుండా ప్రభుత్వం వెంటనే సమగ్ర, నిష్పాక్షిక మరియు పారదర్శకమైన ఉన్నత స్థాయి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు


ప్రధాన కార్యదర్శి పూసాల శ్రీనివాసాచారి మాట్లాడుతూ:బాధిత కుటుంబానికి తక్షణమే పరిపూర్ణ న్యాయం జరగాలి. కేసు విచారణలో ఆలస్యం జరగకుండా ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేసి, విచారణను వేగవంతం చేయాలి అప్పుడే బాధితులకు సత్వర న్యాయం జరుగుతుంది అదేవిధంగా శిరీషని,కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న అర్హులైన ఆమె కుటుంబ సభ్యులలో అర్హులైన వారిలో ఒకరికి ప్రభుత్వం ఉద్యోగం ఇచ్చి ఆ కుటుంబాన్ని ప్రభుత్వం వెంటనేఆర్థికంగా ఆదుకోవాలి అని ప్రభుత్వాన్ని కోరారు.


అనంతరం ఇతర సీనియర్ న్యాయవాదులు మాట్లాడుతూ హైదరాబాద్ తో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలోని ఉద్యోగాలు, వృత్తులు చేసుకుంటున్న మహిళల భద్రతపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం మహిళ ఉద్యోగుల భద్రతపై పటిష్ట చర్యలను తీసుకోవాలని పేర్కొన్నారు. ఊకే శిరీష కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు న్యాయవాదలోకం తరపున పోరాటం సాగిస్తాం అని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో భద్రాచలం బార్ అసోసియేషన్ అధ్యక్షులు కొడాలి శ్రీనివాసన్, ప్రధాన కార్యదర్శి పూసాల శ్రీనివాసాచారి, జాయింట్ సెక్రటరీ తాతా లలిత, లేడీ రిప్రజెంటేటివ్ తరుణి, మాజీ అధ్యక్షులు కోట దేవదానం, సీనియర్ న్యాయవాదులు పలివెల నరసింహారావు, రావి రామ్మోహన్, పేరాల వెంకటేశ్వర్లు,పేరాల నాగరాజు, బండారు అరుణ్ చంద్, కాపుల ప్రకాష్, చీమల నరసింహారావు,కె అరుణ శ్రీ, అవులూరి సత్యనారాయణ, పామరాజు తిరుమలరావు, ఎంవి రమా, నర్మదా, పాయం రవివర్మ, కొరసాకృష్ణార్జునరావు, బండారు రమేష్, ఉప్పు నాగేందర్, పి. భాస్కరరావు, బి. శారద, విద్యాధరి, దాట్ల సంధ్య, వలవల సురేష్ కుమార్, బి రామకృష్ణ, ఏ రజని, గాయత్రి, బి.వి.కార్తీక్, కారం రమేష్, కొరసా నరేష్, ఎస్ కే యాకోబ్ జానీ, అంజలి, లక్ష్మణ్, ఈసంపల్లి, సున్నం వెంకటరమణ, శ్రీనివాస్, పల్లంటి ప్రవీణ్ కుమార్, చల్లా శివకృష్ణ, కోరాడ శ్రీనివాస్, అరవింద్, చందన, పసుపులేటి ఆశ్రిత, వరసా సునీత, ముదిగొండ కిరణ్,తదితర న్యాయవాదులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు