– కరెంటు వాళ్ళ సొమ్ము నర్సరీ యజమాన్యుల పాలు
— నర్సరీ యాజమాన్యాల…దందా లక్షలలో లాభాలు– —-విద్యుత్ శాఖ ఆదాయం కు కోట్లలో గండి
– పంట చేతికి అందక రైతుల ప్రాణాలు గాలిలోకి
— పర్యవేక్షణ లేమి –విద్యుత్ శాఖలో పేరుకే విజిలెన్స్ అధికారులు
— ఇటు వైపు కన్నెత్తి చూడని
జిల్లా విద్యుత్ శాఖ అధికారులు
— తూతూ మంత్రంగా వ్యవహరిస్తున్న మండల విద్యుత్ శాఖ అధికారి, విద్యుత్ శాఖలో ఎక్కడ చేసిన గొంగడి అక్కడే, పేరుక్కుపోతున్న సమస్యలు
— నర్సరీ యజమాన్యులకు మంగళం పాడుతున్న మండల విద్యుత్ అధికారి
— మండలంలో వ్యాపారుల యథేచ్ఛగా అక్రమాలు
— కమర్షియల్ కనెక్షన్లు లేకుండానే లక్షల్లో వ్యాపారం
— లో-వోల్టేజ్‌తో పంటలు ఎండిపోతున్నాయని రైతుల ఆవేదన
— రైతన్నలకు ఆదుకునేది ఎవరు ? వారి హరిగోశ ఇనేది ఎవరు?
— ఇంకనైనా స్పందించండి మహాప్రభూ అంటూ వేడుకోలు..

ఆగస్టు 30: TODAY 9
అన్నదాతల సాగునీటి అవసరాల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న వ్యవసాయ మోటర్ విద్యుత్ కలెక్షన్ పథకం కామేపల్లి మండలంలో వ్యాపారుల పాలిట కామధేనువుగా మారింది.పేద, మధ్యతరగతి రైతులకు లబ్ధి చేకూర్చాల్సిన ఉచిత కరెంటును, కమర్షియల్ ప్రాతిపదికన మిర్చి నర్సరీలు నడుపుతున్న నిర్వాహకులు దర్జాగా దుర్వినియోగం చేస్తున్నారు..
నిబంధనలకు మంగళం పలుకుతూ వేలాది రూపాయల విలువైన విద్యుత్‌ను చౌర్యం చేస్తున్నా అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు అంటూ విమర్శలు విన వస్తున్నాయి దర్జాగా విద్యుత్ చౌర్యానికి పాల్పడుతున్న వారిపై ఎటువంటి కఠిన చర్యలు తీసుకోవడం లేదని స్థానిక ప్రజలు, రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అక్రమ విద్యుత్తే ఫుల్.. శాఖ రాబడికి గండి
కామేపల్లి మండల వ్యాప్తంగా వివిధ గ్రామాల్లో పదుల సంఖ్యలో వాణిజ్య నర్సరీలు వెలిశాయి. నిబంధనల ప్రకారం వ్యాపార సముదాయాలు, నర్సరీ నిర్వాహకులు కమర్షియల్ విద్యుత్ కనెక్షన్ తీసుకుని, వాడిన యూనిట్లకు తగినట్లుగా బిల్లులు చెల్లించాల్సి ఉంటుంది .కాగా , ఇక్కడి నర్సరీ యజమానులు సమీపంలోని వ్యవసాయ బావులు,బోరు కనెక్షన్ల నుంచి అక్రమంగా వైర్లు లాగి భారీ ఫైవ్ హెచ్‌పి మోటార్లు నడుపుతున్నారు.
. అంతే కాకుండా రాత్రి వేళల్లో షేడ్ నెట్ల కింద మొక్కల వేగవంతమైన పెరుగుదల కోసం హై-వోల్టేజ్ లైట్లు, స్ప్రింక్లర్లు,డ్రిప్ సిస్టమ్‌లను ఈ ఉచిత విద్యుత్‌తోనే నడుపుతున్నారు. దీనివల్ల విద్యుత్ సంస్థకు ప్రతి నెలా లక్షలాది రూపాయల రాబడికి గండి పడుతోంది.
అన్నదాతలకు తప్పని లో-వోల్టేజ్ తిప్పలు..
నర్సరీలలో అక్రమంగా భారీ మోటార్లు, రాత్రింబవళ్లు విద్యుత్ పరికరాలు నడపడం వల్ల స్థానిక ట్రాన్స్ఫార్మర్లపై తీవ్ర అదనపు భారం పడుతోంది. ఫలితంగా చుట్టుపక్కల పొలాలకు సాగునీరు అందించే వ్యవసాయ మోటార్లకు తీవ్ర లో-వోల్టేజ్ సమస్యలు తలెత్తుతున్నాయి.
సమయానికి పంటలకు నీరు అందక పొలాలు ఎండిపోతున్నాయని, మోటార్లు నడవక తరచూ ట్రాన్స్ఫార్మర్లు దగ్గర ఫీజులు జంపర్లు కాలిపోతుండటంతో ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతున్నామని స్థానిక రైతులు వాపోతున్నారు.
మండల విద్యుత్ శాఖ అధికారి ఏఈని వివరణ కోరగా వారు ఈ సందర్భంగా మాట్లాడుతూ నర్సరీ నడుపుచున్న యజమానులకు పలు మార్లు నోటీసులు ఇచ్చామని . వారి నుండి ఎటువంటి. స్పందన లేదుని ఏఈ అన్నారు..
మిర్చి నర్సరీల అక్రమ విద్యుత్ వినియోగంపై మండలంలోని పలు నర్సరీలకు గతంలోనే నోటీసులు జారీ చేశామని తెలిపారు. తక్షణమే కమర్షియల్ కనెక్షన్లు తీసుకోవాలని ఆదేశించినప్పటికీ నిర్వాహకుల నుంచి ఎలాంటి స్పందన రాలేదని అన్నారు…









