ఎస్ఐ గోపి చాకచక్యంతో అదృశ్యమైన యువతి ఆచూకీ లభ్యం
టెక్నాలజీ సాయంతో కేసును ఛేదించిన కారేపల్లి పోలీసులు.. తల్లిదండ్రులకు అప్పగింత,
ఆగస్టు 24 : TODAY9…:
మూడు నెలల క్రితం అదృశ్యమైన యువతి ఆచూకీని కారేపల్లి ఎస్ఐ గోపి ఆధ్వర్యంలోని పోలీసులు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి గుర్తించారు. యువతిని సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించడంతో కుటుంబ సభ్యులు ఊపిరిపీల్చుకున్నారు.
యువతిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న హైదరాబాద్‌కు చెందిన యువకుడిపై పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.
ఎస్ఐ గోపి తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని బళ్లునగర్ తండాకు చెందిన యువతి గత మే నెలలో అదృశ్యమైంది. యువతి తల్లిదండ్రులు కారేపల్లి పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేయగా, పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. యువతి వద్ద మొబైల్ ఫోన్ లేకపోవడంతో ఆమె ఆచూకీ గుర్తించడం పోలీసులకు సవాల్‌గా మారింది…
ఈ నేపథ్యంలో ఎస్ఐ గోపి ఆధ్వర్యంలో పోలీసులు అందుబాటులో ఉన్న సాంకేతిక ఆధారాలను వినియోగిస్తూ దర్యాప్తును ముమ్మరం చేశారు. వివిధ కోణాల్లో విచారణ చేపట్టి చివరకు యువతి ఆచూకీని గుర్తించారు. అనంతరం ఆమెను సురక్షితంగా కారేపల్లికి తీసుకువచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు.
యువతిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న హైదరాబాద్‌కు చెందిన రుకుమ్ అనే యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతనిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్ఐ గోపి తెలిపారు.
మూడు నెలలుగా ఆందోళనలో ఉన్న కుటుంబ సభ్యులకు యువతి ఆచూకీ లభించడంతో ఊరట లభించింది. సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థంగా వినియోగించి కేసును ఛేదించిన కారేపల్లి పోలీసులను పలువురు అభినందించారు.









