•కొత్తగూడెం’ లేదా ‘భద్రాద్రి కొత్తగూడెం’ గా మార్చాలని కోరుతూ రైల్వే అధికారులకు విజ్ఞప్తి..
భద్రాద్రి కొత్తగూడెం, ఆగస్టు 22 TODAY9
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కీలకమైన భద్రాచలం రోడ్డు (బిడిసిఆర్) రైల్వే స్టేషన్ పేరును మార్చాలన్న డిమాండ్ మరోసారి తెరపైకి వచ్చింది. స్టేషన్ పేరును ‘కొత్తగూడెం’ లేదా ‘భద్రాద్రి కొత్తగూడెం’ గా మార్చాలని కోరుతూ ప్రజాప్రతినిధులు రైల్వే అధికారులను కలిసి విజ్ఞప్తి చేశారు.
ఖమ్మం ఎంపీ రఘురాం రెడ్డి, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర తదితరులు సికింద్రాబాద్‌లోని రైల్ నిలయంలో దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్‌ను కలిసి స్టేషన్ పేరు మార్పు అంశాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లారు.
ప్రస్తుతం ‘భద్రాచలం రోడ్డు’గా పిలుస్తున్న ఈ రైల్వే స్టేషన్ వాస్తవానికి కొత్తగూడెం పట్టణ పరిధిలో ఉంది. భద్రాచలం పట్టణం స్టేషన్‌కు సుమారు 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. దీంతో కొత్తగూడెంకు వచ్చే ప్రయాణికులతో పాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారికి స్టేషన్ పేరు కొంత గందరగోళానికి గురిచేస్తోందని ప్రజాప్రతినిధులు పేర్కొన్నారు.









