భద్రాచలం ఆగస్టు 17: D వినేష్
గిరిజనులు విన్నవించిన ప్రతి ప్రతి దరఖాస్తును నిర్ణీత సమయంలో పరిష్కరించాలి
అర్హులైన ప్రతి గిరిజనులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించేలా యూనిట్ అధికారులు కృషి చేయాలి
ఏజెన్సీ ఏరియాలోని గిరిజనులు వివిధ సమస్యల కొరకు ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొంది జీవనోపాధి పెంపొందించుకోవడానికి సమర్పించే దరఖాస్తులను ఐటిడిఏ యూనిట్ అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపి అర్హులైన ప్రతి గిరిజన కుటుంబాలకు ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు అందించే విధంగా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి రాహుల్ అన్నారు.
సోమవారం నాడు ఐటిడిఏ కార్యాలయంలో నిర్వహించిన గిరిజన దర్బార్ లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని వివిధ ఏజెన్సీ గిరిజన ప్రాంతాల నుంచి వచ్చిన గిరిజనుల నుండి విన్నపాలు, ఇతర సమస్యల దరఖాస్తులను ఎస్ డి సి ఆనంద్ కుమార్, డిడి ట్రైబల్ వెల్ఫేర్ అధికారిని శ్రీమతి చందన, ఏ డి ఎం హెచ్ ఓ సైదులు, ట్రైబల్ వెల్ఫేర్ మధుకర్ తో కలిసి స్వీకరించారు.
భూ సమస్యలు, పోడు పట్టాల సమస్యలు, సంక్షేమ పథకాల అమలు, ఉపాధి, పెన్షన్లు, గృహాలు, మౌలిక వసతులు, సామాజిక భద్రత తదితర సమస్యలను గిరిజనులు ఐటీడీఏ పిఓ దృష్టికి తీసుకువచ్చారు.
ఈ సందర్భంగా పిఓ మాట్లాడుతూ, గిరిజన దర్బార్ కార్యక్రమం గిరిజనుల సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరించేందుకు ప్రభుత్వం కల్పించిన అత్యంత కీలక వేదిక అని అన్నారు. గిరిజనుల నుంచి అందిన ప్రతి విన్నపాన్ని అత్యంత ప్రాధాన్యంతో పరిశీలించి, నిర్ణీత గడువులోగా పరిష్కరించేలా సంబంధిత శాఖల యూనిట్ అధికారులు బాధ్యతతో వ్యవహరించాలని ఆదేశించారు.
గిరిజన కుటుంబాల సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం, జాప్యానికి ఎలాంటి అవకాశం ఉండకూడదని అన్నారు...ప్రతి విన్నపాన్ని పరిశీలించి, సమస్య స్వభావాన్ని బట్టి సంబంధిత శాఖల యూనిట్ అధికారులకు వెంటనే పంపించి, గడువులోగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. తక్షణమే పరిష్కరించగల అంశాలను ఆలస్యం చేయకుండా పూర్తి చేయాలని, క్లిష్టమైన సమస్యలపై నిరంతర పర్యవేక్షణతో గిరిజనులకు న్యాయం జరిగేలా చర్యలు చేపట్టాలని యూనిట్ అధికారులను ఆదేశించారు.
ఐటీడీఏ యూనిట్ అధికారుల శాఖల మధ్య సమన్వయం, సమర్థవంతమైన కార్యాచరణ ద్వారా గిరిజనుల సమస్యల పరిష్కారం వేగవంతమవుతుందని పిఓ అన్నారు . గిరిజన దర్బార్ లో స్వీకరించిన ప్రతి వినతిపై ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తూ, త్వరితగతిన పరిష్కార స్థితిని పరిశీలించాలని యూనిట్ అధికారులకు సూచించారు. గిరిజనుల విశ్వాసాన్ని నిలబెట్టే విధంగా ఐటీడీఏలోని ప్రతి శాఖ బాధ్యతాయుతంగా స్పందించి, ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి గిరిజన కుటుంబాలకు సకాలంలో అందించాలని తెలిపారు.

గిరిజనులు తమ దరఖాస్తుతో పాటు అవసరమైన ఆధార పత్రాలను సమర్పిస్తే సమస్యల పరిష్కారం మరింత త్వరగా జరిగే అవకాశం ఉంటుందని ఐటీడీఏ పీవో తెలిపారు.
గిరిజనులకు పారదర్శకమైన, జవాబుదారీతనంతో కూడిన పాలన అందించేందుకు ప్రతి యూనిట్ అధికారి కృషి చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఉద్యానవ న అధికారి ఉదయ్ కుమార్, పి వి టి జి అధికారి గన్యా, ఏపీఓ పవర్ వేణు, ఎల్ టి ఆర్ డి టి మనిధర్, ఏవో సున్నం రాంబాబు,మిషన్ భగీరథ ఏఈఈ వసుంధర, జేడీఎం హరికృష్ణ, మేనేజర్ ఆదినారాయణ సంబంధిత శాఖల సిబ్బంది నరేందర్, వెంకటేశ్వర్, విజయ్, నాగేశ్వరరావు, భూచాలు, స్వాతి, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.
Post Views: 21









