పెండింగ్ లో ఉన్న ఎస్సీ కమ్యూనిటీ హాల్ పూర్తి నిర్మాణం కోసం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు రూ 50 లక్షలు మంజూరీకై హామీ ….

.హర్షం వ్యక్తపరిచిన ఎస్సీ కమ్యూనిటీ హాల్ కమిటీ..


భద్రాచల పట్టణంలో పూర్తి నిర్మాణం కాకుండా ఉన్న ఎస్సీ కమ్యూనిటీ హాల్ శిధిలావస్థకు చేరుకున్నదని, తక్షణమే నిర్మాణం చేపట్టాలని, ఎస్సీ కమ్యూనిటీ హాల్ నిర్మాణ కమిటీ ఆధ్వర్యంలో భద్రాచలం శాసనసభ్యులు డాక్టర్ తెల్ల వెంకటరావు కు వినతి పత్రం అందించారు . దీనిపై స్పందించిన ఎమ్మెల్యే డాక్టర్ తెల్ల వెంకటరావు మాట్లాడుతూ…. ఎస్సీ కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం తక్షణమే 50 లక్షల రూపాయలు విడుదల చేస్తానని, ఎస్సీ కమ్యూనిటీ హాల్ నిర్మాణం తన బాధ్యత అని అందుకోసం అవసరమైతే మంత్రి అట్లూరి లక్ష్మణ్ ను కూడా కలుద్దామని హామీ ఇచ్చారని ఒక ప్రకటనలో తెలియజేశారు.

. ఈ సందర్భంగా ఎస్సీ కమిటీ హాల్ నిర్మల కమిటీ సభ్యులు మాట్లాడుతూ… 30 ఏళ్లుగా ఎస్సీ కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం చేయని పోరాటం ప్రయత్నం లేదని, గత ప్రభుత్వం లో దరఖాస్తులు ధర్నాలు పోరాటాల వల్ల ప్రభుత్వం దిగివచ్చి ఎస్సీ కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం బడ్జెట్ కేటాయించడం జరిగిందని, సంవత్సరాలు గడిచిన నిర్మాణం పూర్తి కాకపోవడం బాధగా ఉందని ఆవేదన వ్యక్తపరిచారు.

ఇది ఇలా ఉండగా ఈ విషయమై స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తెల్ల వెంకటరావుకు వినతి పత్రం అందించగానే తక్షణమే ఎస్సీ కమ్యూనిటీ హాల్ నిర్మాణం పూర్తి చేసేందుకు 50 లక్షల రూపాయలు ఉండాలని, అదేవిధంగా ఎస్సీ కమ్యూనిటీ హాల్ చుట్టుపక్కల చెత్త చెదారాన్ని తొలగించి శుభ్రపరచాలని గ్రామపంచాయతీ సర్పంచ్ పూనం కృష్ణ కు చెప్పడం జరిగిందని అన్నారు. ఎస్సీ కమ్యూనిటీ హాల్ నిర్మాణ పూర్తి చేస్తే ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకటరావు కు దళిత సమాజం రుణపడి ఉంటుందని తెలియజేశారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు