శ్రీరాముడిపై సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా భద్రాచలంలో బీజేపీ ఆందోళన…

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హిందువుల ఆరాధ్య దైవం, ప్రపంచానికి ఆదర్శ పురుషుడైన శ్రీరాముడిపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ భద్రాచలం బ్రిడ్జి సెంటర్ వద్ద భారతీయ జనతా పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు.

శ్రీరాముడిని ధనికుల దేవుడిగా, పరమశివుడిని పేదల దేవుడిగా అభివర్ణించడం హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉందని బీజేపీ నాయకులు పేర్కొన్నారు. దేవుళ్లను ఆర్థిక వర్గాల పేరుతో విభజించి మాట్లాడటం సరికాదని అన్నారు.

దక్షిణ అయోధ్యగా ప్రసిద్ధి చెందిన భద్రాచల శ్రీరామచంద్రస్వామి కొలువై ఉన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి భక్తుల విశ్వాసాలను గౌరవిస్తూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని హితవు పలికారు .

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తక్షణమే తన వ్యాఖ్యలను ఉపసంహరించుకొని, హిందువులకు బేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పాలని భారతీయ జనతా పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. అయితే ఆందోళన నిర్వహిస్తున్న బిజెపి నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకొని స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలించారు

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు