ఈరోజు నుంచి కొత్త రూల్స్…LPG నుంచి UPI వరకు కీలక మార్పులు..

అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్ అమల్లోకి వచ్చాయి …LPG నుంచి UPI వరకు కీలక మార్పులు చేశారు. ఎల్‌పీజీ సబ్సిడీ ధరకు సిలిండర్ పొందాలంటే బయోమెట్రిక్ ఆధార్ అథెంటికేషన్ తప్పనిసరి. పూర్తి చేయకపోతే మార్కెట్ ధర చెల్లించాల్సి ఉంటుంది.

అలాగే SBI శాలరీ ప్యాకేజీ ఖాతాదారులకు ఇతర బ్యాంకుల ఏటీఎంలలో ఉచిత లావాదేవీలను నెలకు 10 నుంచి 5కు తగ్గించారు . BSBD ఖాతాలకు 4 ఉచిత విత్‌డ్రాయల్స్ కొనసాగింపులో మార్పు లేదు.రూ.2,000 పైబడిన నిర్దిష్ట మర్చంట్ UPI లావాదేవీలకు కొత్త MDR ఫ్రేమ్‌వర్క్. కస్టమర్లపై ఛార్జీల భారం ఉండదు. P2P లావాదేవీలు ఉచితంగానే కొనసాగుతాయి.

ఇది ఇలా ఉంటే ట్యాక్స్ ఆడిట్ రిపోర్టు గడువు అక్టోబర్ 21 వరకు, ITR దాఖలు గడువు నవంబర్ 21 వరకు పొడిగించబడింది .NRIల నుంచి ఆస్తులు కొనుగోలు చేసే రెసిడెంట్ వ్యక్తులు, HUFలకు TDS కోసం ప్రత్యేక TAN అవసరం లేదు. PANతోనే ప్రక్రియ పూర్తి చేయొచ్చు. NPSలో PRANకు రూ.200 వన్‌టైమ్ ఆన్‌బోర్డింగ్ ఛార్జీ అమలు చేయనున్నారు .

RRBలు బల్క్ డిపాజిట్ వడ్డీ రేట్లను పనిదినాల్లో ఉదయం 10 గంటలకల్లా వెబ్‌సైట్లలో ప్రకటించాలి. అక్టోబర్ 5-7 వరకు RBI MPC భేటీ జరగనుండగా, 7న కీలక వడ్డీ రేట్లపై నిర్ణయం వెలువడనుంది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు