సంచలన వ్యాఖ్యలు చేసిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు..చిన్నారెడ్డి…

సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు జి.చిన్నారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు తాను కూడా జీవన్ రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడే సమయం వచ్చిందంటూ పార్టీ లో తీవ్ర దుమారం రేపారు.తనను కాదని వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి డబ్బులు ఇచ్చి ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకున్నాడని అన్నారు.

కాగా కాంగ్రెస్ అధినేత సోనియాగాంధీ టికెట్ నాకే ఇవ్వాలని చెప్పినా మేఘారెడ్డి దగ్గర డబ్బులు తీసుకుని టికెట్ అతనికి ఇచ్చారన్నారు.నియోజకవర్గంలో జరిగే అభివృద్ధి పనుల కాంట్రాక్టులు తన వారికి రాలేదని, పనులు అన్నీ ఆపేస్తున్నాడని మండి పడ్డారు.మేఘా రెడ్డి తన అనుచరులను బాగా ఇబ్బంది పెడుతున్నాడని, తాను జీవన్ రెడ్డిలా తిరగబడే సమయం వచ్చిందని ప్రకటించారు…

కాగా తాను పార్టీ నుండి వెళ్ళనని , మేఘారెడ్డి లాంటి తప్పుడు పనులు చేసే వాళ్ళను పార్టీ నుండి తరిమేస్తానని,కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు జి.చిన్నారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేయటంతో పార్టీ వర్గాల్లో తీవ్రదుమారం రేపినట్టు అయ్యింది.

‘మేఘారెడ్డి డబ్బులు ఇచ్చి ఎమ్మెల్యే టికెట్ కొన్నాడు’

కాంగ్రెస్ సీనియర్ నాయకుడు చిన్నారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వనపర్తి MLA మేఘారెడ్డి డబ్బులు ఇచ్చి టికెట్ కొనుగోలు చేశాడని ఆరోపణలు చేశారు.

నిజానికి సోనియా గాంధీ తనకే టికెట్ ఇచ్చిందని.. డబ్బులు లేకపోవడంతో మీరే ఖర్చు పెట్టుకొని గెలిపించాలని రేవంత్ రెడ్డికి చెప్పారని వెల్లడించారు. కాగా .. రేవంత్ రెడ్డి డబ్బులకు ఆశ పడి, మేఘారెడ్డి వద్ద డబ్బులు తీసుకొని, అతనికే టికెట్ ఇచ్చాడని వ్యాఖ్యా నించారు.. నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు కూడా మేఘారెడ్డి అడ్డు పడుతున్నాడని, మంత్రులే ఈ మాట చెప్పారన్నారు చిన్నారెడ్డి..ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే జీవన్ రెడ్డి‌లా తానూ తిరగబడతానని చిన్నారెడ్డి హెచ్చరించటం చర్చనీయాంశం అయ్యింది..

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు