అశ్వాపురం మండలంలోని సీతారామ ప్రాజెక్ట్ మారేళ్లపాడు ఎత్తిపోతల పథకం పనులను పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పరిశీలించారు. ప్రాజెక్ట్ పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే, పనుల్లో ఎలాంటి జాప్యం లేకుండా నాణ్యతా ప్రమాణాలు పాటించాలని సూచించారు.

అనంతరం అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో పనుల పురోగతిపై సమీక్షించిన ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, మారేళ్లపాడు ఎత్తిపోతల పథకం పనులను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పనులను వేగవంతం చేసి రైతులకు సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

సీతారామ ప్రాజెక్ట్ ద్వారా రైతులకు సాగునీరు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే తెలిపారు.

ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, మండల అధ్యక్షులు, జిల్లా ముఖ్య నాయకులు, మండల ముఖ్య నాయకులు, సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులు, మాజీ ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.









