కవితకు టీఆర్ఎస్ పార్టీకి ఎన్నికల సంఘం షాక్.!
పార్టీ పేరు మార్చాల్సిందే అని ఎన్నికల సంఘం లేఖ..
15 రోజుల్లో మూడు ప్రత్యామ్నాయ పేర్లు ఇవ్వకపోతే పార్టీ దరఖాస్తును మూసివేస్తామని హెచ్చరిక.
తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) పేరు మార్చుకోవాల్సిందేనని కవితకు ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది.కవిత కొత్త పార్టీ తెలంగాణ రక్షణ సేనపై ప్రజల్లో అనేక అభ్యంతరాలు ఉన్నందున ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది!…
టీఆర్ఎస్ పేరుపై ప్రజలు వ్యక్తం చేసిన ఆందోళనల నేపథ్యంలో ఆ పేరుతో ముందుకు సాగడం కుదరదని కేంద్ర ఎన్నికల సంఘం తేల్చి చెప్పిన నేపథ్యంలో ఆమె ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకుంటారా అనేది వేచి చూడాలి .

కాగా 15 రోజుల్లో మూడు ప్రత్యామ్నాయ పేర్లు ఇవ్వకపోతే టీఆర్ఎస్ తో పార్టీ కొనసాగడం కుదరదని ఎలాంటి తదుపరి సమాచారం లేకుండా పార్టీ దరఖాస్తును మూసివేస్తామని సీఈసీ వెల్లడిచేసింది.
కల్వకుంట్ల కవిత ప్రతిపాదించిన ‘తెలంగాణ రక్షణ సేన’ (TRS) పార్టీ పేరును కేంద్ర ఎన్నికల సంఘం తిరస్కరించింది. ఈ పేరుతో కొత్త పార్టీని రిజిస్టర్ చేయడం కుదరదని స్పష్టం చేస్తూ, మరో 15 రోజుల్లో కొత్త పేరును ప్రతిపాదించాలని ఆదేశించింది.
మళ్లీ పాత సెంటిమెంట్‌తో ‘TRS’ పేరును రీ-క్రియేట్ చేయాలనుకున్న కవిత ప్లాన్‌కు తొలి అడుగులోనే బ్రేక్ పడినట్లయింది…
ఈ విషయం పై కవిత స్పందిస్తూ టీఆర్ఎస్ పార్టీ పేరు మార్చేది లేదని,కొత్త పార్టీ పేర్లు ఇవ్వనన్నారు ,సీఈసీ నిర్ణయంపై న్యాయ పోరాటం చేస్తానన్నారు మాజీ ఎమ్మెల్సీ కవిత







