“ఓటర్ల జాబితాపై ECI కీలక నిర్ణయాలు.. Claims, Objections గడువు పొడిగింపు”..

“ఓటర్ల జాబితాపై ECI కీలక నిర్ణయాలు.. Claims, Objections గడువు పొడిగించింది.శనివారం మధ్యాహ్నం న్యూఢిల్లీలోని నిర్వాచన్ సదన్ లో భారత ఎన్నికల సంఘం సమావేశం నిర్వహించారు . ఈ సమావేశానికి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ తోపాటు, సుఖ్బీర్ సింగ్, డాక్టర్ వివేక్ జోషిలు హాజరయ్యారు.

SIRలో Unmapped, Logical Discrepanciesపై నోటీసులు అందుకున్న ఓటర్ల ఇళ్లకు BLOలు వెళ్లి అవసరమైన డాక్యుమెంట్లు సేకరించనున్నారు. వాటిని ECINetలో అప్‌లోడ్ చేసి ERO నిర్ణయం తీసుకోనున్నారు. సాధారణంగా ERO/AERO కార్యాలయానికి పిలిచి Hearing నిర్వహించాల్సిన అవసరం లేదని ECI స్పష్టం చేసింది.

SIR సమయంలో లేదా ఆ తర్వాత ఓటర్ల జాబితాలో పేరు మిస్సైనవారు, మొదటిసారి ఓటు హక్కు పొందినవారు సైతం Continuous Updation ప్రక్రియ ద్వారా సంబంధిత EROను సంప్రదించి పేరు నమోదు చేసుకోవచ్చని ECI తెలిపింది.

ఇది ఇలా ఉంటే,Hearing అవసరమైన Exceptional Casesలో Online Hearingకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఓటరు తరఫున కుటుంబంలోని ఏదైనా Adult Memberను హాజరయ్యేందుకు అనుమతించే వెసులుబాటు కూడా కల్పించనున్నారు. Online Hearing సదుపాయాలను మరింత బలోపేతం చేయాలని ECI నిర్ణయించింది

Night Sheltersలో ఉంటున్నవారు, Labour, Poor, Homeless ప్రజల కోసం DEOs అవసరమైన సంఖ్యలో Help Desks ఏర్పాటు చేయడంతో పాటు Special Camps నిర్వహించనున్నారు. అర్హులైన ఓటర్లకు Electoral Rollలో పేరు నమోదు చేసుకునే ప్రక్రియను సులభతరం చేయనున్నారు.

కాగా ఢిల్లీలో Claims & Objections దాఖలు చేసే గడువును అక్టోబర్ 30, వరకు ECI పొడిగించింది. వచ్చిన Claims, Objectionsను పరిష్కరించే గడువును నవంబర్ 30, 2026 వరకు పెంచడం గమనార్హం.

మహారాష్ట్ర లో Claims & Objections దాఖలు చేసేందుకు అక్టోబర్ 12, వరకు అవకాశం ఇచ్చింది. వాటి Disposal గడువును నవంబర్ 10, వరకు పొడిగించింది.ECINET వ్యవస్థను సమీక్షించేందుకు Senior Deputy Election Commissioner నేతృత్వంలో Committee ఏర్పాటు చేయనున్నారు. ఇందులో IIT/IIITకు చెందిన Independent Expert కూడా ఉంటారు. ECINET చట్టాలు, నిబంధనలకు అనుగుణంగా పనిచేస్తుందో ఈ Committee పరిశీలించనుంది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు