చట్టానికి రాష్ట్రపతి ఆమోదముద్ర
భారత స్వాతంత్య్ర పోరాటంలో కోట్లాది మందిలో దేశభక్తి రగిలించిన అమర గీతం వందేమాతరం కు అత్యున్నత గౌరవం దక్కింది.
వందేమాతరం గీతానికి జాతీయ గీతం తో సమానమైన అధికారిక హోదాను కల్పిస్తూ రూపొందించిన నూతన చట్టానికి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదముద్ర వేశారు. రాష్ట్రపతి అంగీకారంతో ఈ బిల్లు చట్టరూపం దాల్చింది.
ఇకపై వందేమాతరం గీతాన్ని ఎవరైనా అడ్డుకున్నా, బహిరంగంగా అవమానించినా లేదా హేళన చేసినా దాన్ని చట్టరీత్యా తీవ్రమైన నేరంగా పరిగణించనున్నారు. పాఠశాలలు, ప్రభుత్వ కార్యక్రమాలు, బహిరంగ సభల్లో వందేమాతరం గీతాలాపన జరుగుతున్న సమయంలో గేయానికి విఘాతం కలిగించినా, అసౌకర్యం కలిగించినా చట్టప్రకారం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ‘జన గణ మన’ మాదిరిగానే వందేమాతరం ఆలాపన సమయంలో ప్రదర్శించాల్సిన ప్రాథమిక క్రమశిక్షణ, గౌరవ నియామకాలు ఈ చట్టం ద్వారా అమలులోకి రానున్నాయి. దేశ చారిత్రక ప్రాధాన్యతను, జాతీయ భావాన్ని మరింత బలోపేతం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ చట్టానికి దేశ ప్రథమ పౌరరాలు, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం లభించడం పట్ల దేశప్రజలకు హర్షం వ్యక్తం చేస్తున్నారు.









