సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో..
కొంతమంది పురుషులు ఒక మహిళను పట్టుకుని బలవంతంగా జుట్టు కత్తిరిస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రాజస్థాన్ కు చెందిన ఒక సోషల్ మీడియా యాక్టివిస్ట్ ఈ వీడియోను పోస్ట్ చేస్తూ…జాతీయ మహిళా కమిషన్, ప్రతిపక్ష నాయకుడు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీలకు ట్యాగ్ చేయడంతో ఈ విషయం మరింత ప్రచారం అయ్యింది.
సదరు పోస్ట్ చేసిన వ్యక్తి తన పోస్టులో మనుషులు ఇంత క్రూరంగా ప్రవర్తిస్తారా? మానవత్వం అనే పదానికి అర్ధం తెలియకుండా ఇటువంటి చర్యలకు సిద్దపడటం అంత్యంత హేయమైన పని అంటూ వ్రాసుకొచ్చారు.
ఈ ఘటనపై జాతీయ మహిళా కమిషన్ సుమోటో గా తీసుకొని, విచారణ చేపట్టాలని, దోషులను శిక్షించాలని, ఇటువంటి సంఘటనలను ఇకముందు జరగకుండా తగు చర్యలను తీసుకోవాలంటూ అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి… ఈ వీడియో చూసిన నెటిజన్లు సైతం తీవ్ర ఆగ్రహవేశాలను ప్రదర్శిస్తున్నారు.ఇటువంటి సంఘటనలు మానవత్వనికే మాయని మచ్చగా అభివర్ణిస్తున్నారు. ప్రభుత్వం, అధికారులు తక్షణమే స్పందించి ఈ సంఘటన ఎక్కడ జరిగిందో తెలుసుకుని, ఈ దుశ్చర్యకు పాల్పడ్డ దోషులను కఠినంగా శిక్షించాలని సామాజిక మాద్యమాల్లో అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.







