రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడడంతో భార్యకు దగ్గరుండి ‘పెళ్లి’చేసిన భర్త….
బీహార్‌లోని నలంద జిల్లా కత్వార్‌సల్పూర్‌లో ఓ విచిత్ర ఘటన వెలుగుచూసింది.
ఇప్పటికే పెళ్లై ముగ్గురు పిల్లలున్న ఓ వివాహిత.. తనకంటే 12 ఏళ్లు చిన్నవాడైన యువకుడితో వివాహేతర సంబంధం కొనసాగించింది.
కొంతకాలంగా గుట్టుచప్పుడు కాకుండా కొనసాగుతున్న ఈ ఇద్దరి ఎఫైర్ గురించి ఇటీవల గ్రామస్తులకు తెలిసింది.
ఈ క్రమంలో మహిళను కలిసేందుకు యువకుడు ఆమె ఇంటికి వెళ్లగా.. స్థానికులు వారిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి విచారించగా,తామిద్దరం ప్రేమించుకుంటున్నామని, వివాహితను పెళ్లి చేసుకుంటానని యువకుడు తెలిపాడు.
తన భార్య ఎఫైర్ విషయం తెలుసుకుని షాక్‌కు గురైన భర్త,ఆమెతో బంధాన్ని కొనసాగించలేనని చెబుతూ, ప్రియుడితో పెళ్లికి అంగీకరించాడు.
దాంతో గ్రామస్తుల సమక్షంలో భర్త దగ్గరుండి మరీ భార్య, ఆమె ప్రియుడి వివాహాన్ని జరిపించాడు.
Post Views: 54







