హైదరాబాద్‌లో జూన్ 2న జనసేన నిర్వహించనున్న ‘తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప సభ’పై TRS అధ్యక్షురాలు కవిత స్పందించారు. మా మేధావులను ఆంధ్రా పోలీసులతో బెదిరిస్తే ఊరుకోమని, రాజకీయ దమ్ముంటే నేరుగా ఎదుర్కోవాలని సవాల్ విసిరారు. సొంత రాజధాని కట్టుకోవడం చేతకాని వాళ్ళు ఇక్కడ పంచాయితీలు పెడితే ఈసారి పళ్ళు రాలడం ఖాయమని కవిత హెచ్చరించారు..
ఇది ఇలా ఉంటే మెడకాయ మీద తలకాయ ఉన్నోడు ఎవడైనా తెలంగాణ పదం డిక్షనరీలో లేదని అంటాడా? అని ప్రశ్నించారు కవిత. రాజ్యాంగ బద్దంగా తెలంగాణను మనం సాధించుకున్నాం.. రాజ్యాంగం తెలంగాణను ఇచ్చిందని గుర్తు చేశారు. పవన్ కళ్యాణ్ తెలంగాణ నవ నిర్మాణం అంటూ సభ పెడుతారంట, ముందు లోకేష్ , పవన్ కళ్యాణ్ మీ సెక్రటేరియేట్ లోని వానకాలం నీళ్లు రాకుండా చూసుకోండి అంటూ చురకలు వేశారు. ప్రతి వానకాలంలో మీ రాజధాని మునుగుతుంటే, సెక్రటేరియేట్ లోని నీళ్లు వస్తుంటే ఆంధ్రా ప్రజలకు ఎంత అవమానం? అని అన్నారు.
ఎక్కడ పడితే అక్కడ ఆంధ్రావాళ్ల విగ్రహాలు పెడుతున్నారు.మేము అధికారంలోకి వచ్చిన తరువాత విగ్రహాలు కూల్చి ఏపీకి పార్శిల్ చేస్తాం అని అన్నారు.మీరు ఇలాగే విగ్రహాలు పెడుతూ పోతే, మేము ఖచ్చితంగా అధికారంలోకి వస్తాం. ఆ తర్వాత పెట్టిన అన్ని విగ్రహాలను పగలగొట్టి తీరుతాంఎవరైనా ఇక్కడికి వచ్చి రొయ్యలు అమ్ముకోవచ్చు, షూటింగ్‌లు చేసుకోవచ్చు లేదా సినిమాలు తీసుకోవచ్చు అంతే కానీ తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీయాలని చూస్తే అని హెచ్చరించారు TRS అధ్యక్షురాలు కవిత.
ఆంధ్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా. వానాకాలం వస్తుంది. మీ సెక్రటేరియట్ లో, మీ అమరావతిలో, మీ ముఖ్యమంత్రి కుర్చీ కింద నీళ్లు రాకుండా చూసుకోండి ఫస్ట్. ప్రతి వానాకాలం అక్కడ క్యాపిటల్ మునుగుడేనని ఎద్దేవా చేశారు. ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ మంత్రులు ఆపరేషన్ల కోసం హైదరాబాద్ వస్తున్నారని, గత 12 ఏళ్లుగా అక్కడ కనీసం ఒక మంచి హాస్పిటల్ కూడా కట్టుకోలేకపోయారని విమర్శలు చేశారు TRS అధ్యక్షురాలు కవిత.
అలాగే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు కవిత కౌంటర్ ఇచ్చారు. రాజధాని కట్టుకునే చేతకాదు కానీ, తెలంగాణలో నవనిర్మాణం చేస్తారా..? అని ప్రశ్నించారు. రాష్ట్రం విడిపోయింది.. కానీ, ప్రజలు విడిపోలే.. ప్రజల మధ్య చిచ్చుపెట్టొద్దని, లేనిపోని పెత్తనాలు చేయాలనుకుంటే ఊరుకునేది ఉండదు అని హెచ్చరించారు తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత.
బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏపీ నాయకుల్లో భయం ఉండేదని.. ఇప్పుడు హద్దులు మీరి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని , ఎక్కడపడితే అక్కడ ఆంధ్రావాళ్ల విగ్రహాలు పెడుతున్నారని విమర్శలు చేశారు.తాము అధికారంలోకి వచ్చిన తరువాత విగ్రహాలు కూల్చి ఏపీకి పార్శిల్ చేస్తాం అన్నారు. రావచ్చు.. పోవచ్చు, రొయ్యలు అమ్ముకోవచ్చు, షూటింగ్ లు చేసుకుని పోవచ్చు, సెక్రటేరియట్ లో ఏపీ నేతలు చక్రం తిప్పుతామంటే ఊరుకోము…అన్నారు తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత..







