ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు..

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్యూరో:దుమ్మగూడెం జూన్ 1:టుడే 9 ప్రతినిధి

దుమ్ముగూడెం మండలంలో నరసాపురం, లచ్చిగూడెం, లక్ష్మీనగరం, నారాయణరావుపేట గ్రామాలలో 12 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకొని, గృహప్రవేశ కార్యక్రమాలలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు మాట్లాడుతూ మండలంలోని పలు గ్రామాలలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన ఇందిరమ్మ ఇండ్లు పథకం ద్వారా నిరుపేద ప్రజలు ఇల్లు నిర్మించుకొని గృహప్రవేశానికి విచ్చేసిన స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు కి అభినందనలు తెలియజేసి, ఎమ్మెల్యే చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం స్థానిక ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావుని లబ్ధిదారుల కుటుంబ సభ్యులు శాలువాతో సత్కరించారు.ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, యూత్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు