భద్రాచలంలో రెండు ద్విచక్ర వాహనాలలలో 09.500 కేజీల గంజాయి పట్టివేత.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్యూరో. జూన్ 9
టుడే 9 ప్రతినిధి

ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ జి.జనార్దన్ రెడ్డి అసిస్టెంట్ కమిషనర్ జి.గణేష్ ఈఎస్ కే.తిరుపతి గార్ల ఆదేశాల మేరకు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్ఐ. సి హెచ్.శ్రీ హరి రావు సిబ్బంది కలిసి కూనవరం నుంచి భద్రాచలం వెళ్లే రోడ్డు నందు గల ఇసుక రీచ్ వద్ద తనిఖీలు నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా కనిపించిన రెండు వాహనాలను ఆపి తనిఖీ చేయగా మొదటి వాహనం యమహా MT15 (TG 03 C 2091)ని ఆపి తనిఖీ చేయగా దానిలో 04.300 కేజీల ఎండు గంజాయి లభ్యమైంది. ఈ గంజాయి ని A1) భానోత్ వీరేందర్ S/o. వీరన్న, R/o. మామిళ్ళగూడెం, ఖమ్మం జిల్లా
A2) గుత్తికొండ యశ్వంత్, S/o. రాము R/o రమణ గుట్ట, ఖమ్మం జిల్లా లు సీలేరు నుండి ఖమ్మం జిల్లాకు తరలిస్తూ పట్టుబడ్డారు. తదుపరి రెండవ వాహనం హోండా షైన్ (TS 04 ER 2054)ని ఆపి తనిఖీ చేయగా దానిలో 05.200 కేజీల ఎండు గంజాయి లభ్యమైంది. ఇట్టి గంజాయి ని A3) షేక్ ఖాసీం S/o. మౌలాలి, R/o. లెనిన్ నగర్, ఖమ్మం జిల్లా, A4) షేక్ అమీర్ S/o. మౌలాలి R/o పాండురంగాపురం, ఖమ్మం జిల్లా లు సీలేరు నుండి ఖమ్మం జిల్లాకు తరలిస్తూ పట్టుబడినారు. ఈ మొత్తం రెండు వాహనాలలో లభ్యమైన 09.500 కేజీల ఎండు గంజాయిని, రెండు వాహనాలను రెండు సెల్ ఫోన్ (వీటి మొత్తం విలువ రూ.6,20,000) లను తదుపరి విచారణ నిమిత్తం భద్రాచలం ఎక్సైజ్ స్టేషన్లో సరెండర్ చేశారు.. తనిఖీలలో హెడ్ కానిస్టేబుల్ ఖలీల్ అహ్మద్, జమాల్ షరీఫ్, కానిస్టేబుల్స్ శివకుమార్, నాగరాజు, ప్రసన్నకుమార్, ఉపేందర్ లు పాల్గొన్నారు. ఏదైనా గంజాయి. మత్తు పదార్థాలకు సంబంధించిన సమాచారం ఉన్నచో టోల్ ఫ్రీ నెంబర్ 18004252523 కు సమాచారం అందించగలరని మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయని ఎస్ఐ తెలియజేశారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు