తెలంగాణ ఆత్మగౌరవం దెబ్బతీసేలా మాట్లాడారు
పవన్ కళ్యాణ్ బీజేపీ ఎజెండా మోస్తున్నారు..
తెలంగాణ ప్రజల చూపు పడితే కోనసీమ కొబ్బరి చెట్లు ఎండిపోతాయన్న పవన్ క్షమాపణలు చెప్పాలిందే అని డిమాండ్ చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్.కాగా ఏపీపై తమకు ప్రేమ ఉంటుంది అని అన్నారు పొన్నం ప్రభాకర్.పవన్ కళ్యాణ్ పైసలు ఇస్తే ఎలాంటి నటన అయినా చేస్తాడు, ఏ డ్రెస్ అంటే ఆ డ్రెస్ వేసుకొని ఎగురుతాడునవ నిర్మాణ సభ గుజరాత్, కేరళ, తమిళనాడులో ఎందుకు పెట్టడం లేదు? అని ప్రశ్నించారు పొన్నం ప్రభాకర్.
జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ తెలంగాణ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పిన తర్వాతే హైదరాబాద్లో నవనిర్మాణ సభ పెట్టుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. తెలంగాణ ఏర్పడినప్పుడు 11 రోజులు అన్నం మానేశానని చెప్పిన వ్యక్తి, ఇప్పుడు ఇక్కడ సభ పెట్టడం ఆక్షేపణీయమన్నారు. రాష్ట్రాన్ని బీజేపీకి తాకట్టు పెట్టడమే పవన్ చెప్పే నవ నిర్మాణమా అని ప్రశ్నించిన ఆయన, బీజేపీ స్క్రిప్ట్ ప్రకారమే పవన్ నటిస్తున్నారని మండిపడ్డారు.
ఏపీ ఉప ముఖ్యమంత్రిగా ఏమైనా పీకగలిగితే అక్కడ చేయి.. ఇక్కడికి వచ్చి నవ నిర్మాణ సభ పెట్టి రెచ్చగొడితే సహించడానికి ఎవ్వరూ సిద్ధంగా లేరన్నారు.. తెలంగాణ ఏర్పడితే 11 రోజులు అన్నం తినని వెధవ.. నీ యాక్టింగులు అందరికీ తెలుసు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు- మంత్రి పొన్నం ప్రభాకర్.
బీజేపీ రెమ్యునరేషన్ ఇచ్చింది కాబట్టే పవన్ కళ్యాణ్ తెలంగాణలో యాక్టింగ్ చేస్తున్నాడన్నారు.ఇది నిజం కాకపోతే.. డబ్బులు తీసుకోలేదని దేవుడిపై ప్రమాణం చేసి చెప్పగలవా పవన్? అని ప్రశ్నించారు. తెలంగాణ ఏర్పడ్డాక 11 రోజులు అన్నం తినలేదన్న వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పు అంటూ డిమాండ్ చేశారు. తెలంగాణ వాళ్ల చూపు పడితే కోనసీమ ఎండిపోయిందన్న దానికి జవాబు చెప్పమని అన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్.







