భద్రాచలం లోని శ్రీ చైతన్య స్కూల్ ఎవరిది.? ఉస్మానియా విద్యార్థి జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు గడ్డం శ్రీ రామ్.

శ్రీ చైతన్య స్కూల్ పేరుపై అనుమానం వ్యక్తం చేసిన ఉస్మానియా విద్యార్థి జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు గడ్డం శ్రీ రామ్.

ఉస్మానియా విద్యార్థి జేఏసీ (జనరల్) రాష్ట్ర అధ్యక్షుడు , భద్రాద్రి యోజన అభివృద్ధి ఫోరం గౌరవ అధ్యక్షుడు గడ్డం శ్రీరామ్ ఆధ్వర్యంలో స్థానిక టూరిజం హోటల్ లో పాత్రికేయ సమావేశాన్ని నిర్వహించారు.

ఈ సమావేశంలో గడ్డం శ్రీరామ్ మాట్లాడుతూ రాజపేట లో ఉన్న శ్రీ చైతన్య స్కూల్ అనేది బిఎస్ రావు శ్రీ చైతన్య కార్పొరేట్ స్కూలా? లేక బిఎస్ రావుకు సంబంధం లేని శ్రీ చైతన్య అనే పేరు కలిగిన స్కూలా అనేది స్కూల్ యాజమాన్యం వివరణ ఇవ్వాలని ప్రశ్నించారు.

ఈ విషయంపై విద్యార్థుల తల్లిదండ్రులు సైతం ఇది బిఎస్ రావు శ్రీ చైతన్య నా కాదా అని నిజా నిజాలు తెలుసుకొని ఫీజులు కట్టాలని సూచించారు. ఈ విషయంపై జిల్లా డీఈవో, మండల ఎంఈఓ తక్షణమే స్పందించి ఇది బిఎస్ రావు శ్రీ చైతన్య కార్పొరేట్ స్కూలా కాదా వివరణ ఇవ్వాలన్నారు. డీఈవో ఎంఈఓలు విద్యార్థుల స్కూల్ తరగతుల వారీగా ఫీజుల వివరాలు తెలపాలని విద్యార్థి జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు గడ్డం శ్రీరామ్ కోరారు.ఈ కార్యక్రమంలో, బండారు కృష్ణ , చింత నాగ ముత్యం, పైలా సాయి కిషోర్ తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share