గత KCR ప్రభుత్వం పేద ప్రజల అభ్యున్నతి కోసం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలను మరింత మెరుగ్గా ఇస్తామని చెప్పి అమలుచేయలేని హామీలను ఇచ్చి ప్రజల ఓట్లతో గెలిచిన కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని పక్కకు పడేసిందని ఆరోపిస్తూ, హామీలను ఖచ్చితంగా అమలు చేయాలనే డిమాండ్ తో BRS దుమ్ముగూడెం మండల కమిటీ ఆద్వర్యంలో మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు.
అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని డిప్యూటీ తహసీల్దార్ భరణి బాబుకు అందచేశారు.ఈ సందర్భంగా BRS పార్టీ డివిజన్ నాయకులు మానే రామక్రిష్ణ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ,”ఆరు గ్యారెంటీ లు,420 హామీలతో ప్రజల్ని మభ్యపెట్టి గెలిచిన కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచిన తర్వాత పేదల సంక్షేమాన్ని గాలికి వదిలి వేయడమే కాక,గత ప్రభుత్వ పథకాలను ఒక్కొక్కటిగా రద్దు చేయడానికి ప్రయత్నిస్తోందని విమర్శించారు.
రైతుభీమా ప్రీమియం కట్టకుండా రైతు బీమాకు మంగళం పలకనుందని,మరోపక్క ఆడబిడ్డ వివాహానికి అండగా నిలిచేందుకు KCR ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలుచేసిన కళ్యాణ లక్ష్మి,షాదీ ముబారక్ పథకాలను తులం బంగారం పెంచి ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం కోర్టు ఆదేశాలు పేరుతో రద్దుచేయడానికి సిద్ధమైందని ఆవేదన వ్యక్తం చేశారు.
గత ప్రభుత్వ పథకాలను మరింత మెరుగ్గా అమలు అరుస్తామని కాంగ్రెస్ ఇచ్చిన వాగ్దానాలు ఖచ్చితంగా అమలు చేయాలని,లేకుంటే ప్రజల పక్షాన BRS నిరంతరం పోరాడుతుందని,ప్రజల అభివృద్ధి,సంక్షేమాన్ని విస్మరిస్తే కాంగ్రెస్ ప్రభుత్వ పతనం తప్పదని జోస్యం పలికారు.
ఏజెన్సీ లో తాలిపేరు ప్రాజెక్ట్ కాలువలను మరమ్మత్తులు చేపట్టకుండా వ్యవసాయాన్ని కూడా నిర్వీర్యం చేస్తోందని విమర్శించారు.ఈ కార్యక్రమంలో కన్వీనర్ కణితి రాముడు, కో కన్వీనర్ MD జాని పాషా, ex ఎంపీపీ రేసు లక్ష్మి, మోతుకూరి రజిని,కొత్తూరు సీతారామారావు,అపకా వీరాజు, తునికి కామేశ్వరరావు, బొల్లి వెంకట్రావు, కాల్వ పూర్ణయ్య, దామెర్ల శ్రీనివాస్ రావు, ప్రజాపతినిధులు వాగే ఖాదర్ బాబు, గుండి రవి, మడకం జోగయ్య, నాయకులు తంతరపల్లి వెంకటేశ్వరావు,గోసంగి కిరణ్,లంక శివ, వాగే కృష్ణ, కుమారీకుంట సూర్య, పాయం, బాలకృష్ణ, వెంకటేష్,కాటిబోయిన వెంకటేశ్వర్లు, కొండ్రు, నర్సింహారావు తదితరులు పాల్గొన్నారు.









