SIR మండల ప్రవాస్ అభియాన్‌లో భాగంగా..

భద్రాచలంలో పర్యటించిన బీజేపీ జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి

భద్రాచలం, జూలై 27: D వినేష్… భద్రాద్రి డివిజన్ ప్రతినిధి…

తెలంగాణ భారతీయ జనతా పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన SIR మండల ప్రవాస్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి భద్రాచలం మండలంలో 24 గంటల పర్యటన నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి SIR కార్యక్రమం అమలు తీరును క్షేత్రస్థాయిలో పరిశీలించి, నమోదును మరింత వేగవంతం చేయడం, ఎదురవుతున్న సమస్యలను గుర్తించి పరిష్కరించే దిశగా పలు సూచనలు చేశారు.

ఈ సందర్భంగా భద్రాచలం పట్టణంలోని 145, 148, 160, 161, 165, 167, 172, 173, 174 పోలింగ్ బూత్‌లను సందర్శించి, ఆయా బూత్‌ల బూత్ లెవల్ అధికారులను (BLOలు) కలిసి ఇప్పటివరకు జరిగిన SIR నమోదు పురోగతి, నమోదైన శాతం, ఎదురైన సమస్యలు, వాటి పరిష్కారానికి అవసరమైన చర్యల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

అనంతరం భద్రాచలం ఎమ్మార్వో వై. రవికుమార్ ను సబ్ కలెక్టర్ కార్యాలయంలో కలిసి, భద్రాచలం మండలంలోని SIR కార్యక్రమానికి సంబంధించిన సమగ్ర నివేదికను పరిశీలించి, నమోదు ప్రక్రియ పురోగతిపై చర్చించారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ భద్రాచలం SIR కన్వీనర్ కుంజా సంతోష్, బీజేపీ నాయకులు కుంజా ధర్మా, ములిశెట్టి రాంమోహన్ రావు, నిడదవోలు నాగబాబు, ఆవుల సుబ్బారావు, బోడ సత్యనారాయణ, దేవరపల్లి వెంకటేశ్వర్లు, ట్రిపుల్ ఎక్స్ చక్రవర్తి, పీసీ కేశవ్, ములిశెట్టి నిఖిల్, అన్నెం హరీష్, అన్నెం సాయి లక్ష్మణ్, జీవా, రామాచారి, షేర్ శ్రీను, పానీపూరి శ్రీను తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు