గిరిజన దర్బార్ లో వచ్చిన ప్రతి విన్నపాన్ని సకాలంలో పరిష్కారం చూపాలి.. ఐటీడీఏ.. పీవో బి రాహుల్..

గిరిజనులు సమర్పించిన విన్నపాలను నిరంతర పర్యవేక్షణతో యూనిట్ అధికారులు బాధ్యతగా వ్యవహరించాలి..

 భద్రాచలం ఐ టి డి ఏ కార్యాలయంలోని సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన గిరిజన దర్బార్ కార్యక్రమంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల నుంచి వచ్చిన గిరిజనులు విన్నపాలను, ఫిర్యాదులను ఐటీడీఏ పీవో బి రాహుల్, ఎస్ డి సి ఆనందకుమార్, గురుకులం ఆర్ సి ఓ అరుణకుమారి, ఈ ఈ ట్రైబల్ వెల్ఫేర్ మధుకర్, డిడి ట్రైబల్ వెల్ఫేర్ చందన, ఎడిఎంహెచ్వో సైదులతో కలిసి  స్వీకరించారు. భూ వివాదాలు, సంక్షేమ పథకాల అమలు, ఉపాధి, మౌలిక వసతులు, సామాజిక భద్రతతో పాటు ఇతర శాఖలకు సంబంధించిన సమస్యలను గిరిజనులు పి ఓ దృష్టికి తీసుకువచ్చారు.

ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించిన ఐటీడీఏ పీవో, గిరిజనుల సమస్యల స్వభావాన్ని బట్టి సంబంధిత శాఖల యూనిట్ అధికారులకు వెంటనే పంపుతూ, నిర్దేశిత గడువులో పరిష్కారం చూపాలని ఆదేశించారు. తక్షణమే పరిష్కరించగల సమస్యలను ఆలస్యం చేయకుండా పరిష్కరించాలని, మిగిలిన విన్నపాలపై నిరంతర పర్యవేక్షణ కొనసాగిస్తూ గిరిజనులకు న్యాయం జరిగేలా చర్యలు చేపట్టాలని సూచించారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు