సర్వే చేస్తామని పీవో ఇచ్చిన హామీ ఏమైంది?.

భద్రాచలం జులై 20 : D వినేష్ : భద్రాద్రి డివిజన్ ప్రతినిధి

తాతల ముత్తాతల నుండి చర్ల మండలం కొయ్యూరు దేవరపల్లి మామిడిగూడెం, గిరిజన ఆదివాసీ ప్రజలు అట్లాగే దుమ్ముగూడెం మండలం గడ్డురిగట్టు గ్రామ ఆదివాసీ గిరిజన సాగులో ఉన్న భూములకు వెళ్లి సాగు చేస్తుంటే పారెస్ట్ అధికారులు దాడులు చేస్తున్నారని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకుడు సతీష్ ఆందోళన వ్యక్తం చేశారు.

మరో పక్క పిఓ ఇచ్చిన ఆర్ ఎఫ్ ఓ ఆర్ పట్టాలు కాగితాలు ఫేక్ అంటూ అవహేళనగా మాట్లాడుతున్న ఫారెస్ట్ వాళ్ళ పై చర్యలు తీసుకునే విషయంలో జాప్యం చేస్తున్నారని వాపోయారు. గతవారం నిర్వహించిన ధర్నా సమయంలో రైతులు పార్టీ అధికారుల సమక్షంలో సమావేశం నిర్వహించి ఈ వారంలో సర్వే చేస్తామని చెప్పి తేదీలు వారాలు మొత్తం నిర్ణయించిన ఐటీడీఏ పీవో ఇప్పుడు తప్పించుకొని తిరగడంలో ఆంతర్యం ఏమిటో అర్థం కావడం లేదని సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ భద్రాచలం డివిజన్ కార్యదర్శి కామ్రేడ్ ముసలి సతీష్ సందేహం వ్యక్తం చేశారు.

ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పిసా యాక్ట్ ను అటవీ హక్కుల చట్టాన్ని ఉల్లంఘించి గ్రామాలలోకి వచ్చి ఎలాంటి తీర్మానాలు లేకుండా ఆదివాసీలు సాగు చేసుకుంటున్న భూములను ఇవి తమ డిపార్ట్మెంట్ కు సంబంధించిన భూములు అంటూ పెత్తనం చెలాయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆదివాసీలపై అక్రమ కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తూ పిఓకు తాము విన్నవించుకుంటే పి ఓ కూడా కనీసం పట్టించుకోకపోతే ఇక మా ఆదివాసులకు దిక్కెవరు అని వారు ప్రశ్నించారు. చదువుకొని ఉద్యోగాలు చేసి రాజ్యాంగానికి కట్టుబడి ఉంటామని ప్రమాణం చేసిన ఫారెస్ట్ వాళ్లే చట్టాలను ఉల్లంఘిస్తుంటే చూచి చూడనట్టుగా ఉంటున్న ఈ ఐటిడిఏ ఆఫీసు ఎవరికోసం పనిచేస్తుంది అని ప్రశ్నించారు.

ఆదివాసుల కోసం ఆదివాసి గ్రామాల అభివృద్ధి కోసం ఆదివాసి రక్షణ కోసం అని ఏర్పాటుచేసిన ఈ ఐటీడీఏ ఆఫీసు ఏ ఒక్క ఆదివాసి సమస్యను పరిష్కరించలేదని తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఈరోజు ఉదయం 11 గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు ధర్నా చేస్తుంటే ఏ ఒక్క అధికారి ఆదివాసులను పట్టించుకోవట్లేదని ఆక్రోశం వెళ్లగక్కారు. ఐటీడీఏ నిర్వహిస్తున్న ఈ ప్రజావాణి ఎవరిని ఉద్దేశించి పెడుతున్నారు అని సందేహం వ్యక్తం చేశారు..

ప్రజావాణికి వందలాదిమంది పోడు సాగు రైతులు హాజరైన తరుణంలో పట్టించుకోకుండా పోలీసులతో అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు లోపలికి వెళ్ళనివ్వకుండా బయటకు రానివ్వకుండా ఆదివాసీలను ఐటిడీఏలోనే ఇబ్బందులకు గురి చేయడం సరికాదని అభిప్రాయపడ్డారు.

కూడు గూడు నీడ లేకుండా ఐటిడిఏ ముందు 6 గంటల పాటు ధర్నా నిర్వహించిన ఆదివాసీలు తమ భవిష్యత్తు విషయంలో ఎంత బాధ పడుతున్నారనేది అధికారులు ఇప్పటికైనా గుర్తించాలని మనవి చేశారు.

తక్షణమే చర్ల దుమ్ముగూడెం మండలాలలోని పోడు సాగు రైతుల భూముల జోలికి రావద్దని ఫారెస్ట్ అధికారులకు సూచించాలి అంటూ ఐటీడీఏ పీవోకు మొరపెట్టుకున్నారు. తరతరాలుగా ఈ భూమినే నమ్ముకుని బ్రతుకుతున్న ఆదివాసీల కు అన్యాయం చేయవద్దని అన్నారు. ఇప్పుడు ఆ భూమిలో విత్తనాలు వేయకుండా, భూమిని సాగు చేయనీయక,ఇబ్బందులకు గురి చేస్తే ఇక సహించేది లేదని అన్నారు .

ఇక చావైనా, బతుకైనా పోడులోనే తేల్చుకుంటామని ఆదివాసీ సంఘం నాయకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దుమ్ముగూడెం పార్టీ మండల కార్యదర్శి జోగారావు మట్ట నరసింహారావు తెల్లం రామకృష్ణ ఇర్ప ప్రసాద్ తెల్లం పెంటమ్మ పాయం రాజమ్మ సరేం సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు