సీతారామ ప్రాజెక్టు పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క…

భట్టి విక్రమార్క తో పాటు పరిశీలనలో పాల్గొన్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు

Today9News ప్రతినిధి,D Ramesh, మణుగూరు

తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, ప్రణాళిక, ఇంధన శాఖ మంత్రి భట్టి విక్రమార్క మల్లుతో పాటు రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి , పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, భద్రాచలం ఎమ్మెల్యే డా. తెల్లం వెంకట్రావు, వైరా ఎమ్మెల్యే శ్రీ రాందాస్ నాయక్, ఇల్లందు ఎమ్మెల్యే శ్రీ కోరం కనకయ్య గురువారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలో పర్యటించారు.

ఈ సందర్భంగా పినపాక నియోజకవర్గంలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న సీతారామ ప్రాజెక్టు, మారెళ్లపాడు లిఫ్ట్ ఇరిగేషన్ పథకం, సీతమ్మ బ్యారేజి నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించి పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. నిర్మాణ పనుల నాణ్యత, పురోగతి, లక్ష్యాల సాధనపై సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు.

అనంతరం ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులతో ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించి, ప్రాజెక్టు పనులను నిర్ణీత గడువులో అత్యున్నత నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేయాలని ఆదేశించారు. పనుల్లో ఎలాంటి జాప్యం లేకుండా అవసరమైన యంత్రాలు, సిబ్బంది, నిధులను సమన్వయం చేసుకొని వేగవంతంగా పనులు పూర్తి చేయాలని సూచించారు. రైతులకు త్వరితగతిన సాగునీరు అందించడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.

సీతారామ ప్రాజెక్టు పూర్తయిన అనంతరం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాతో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని వేలాది ఎకరాలకు శాశ్వత సాగునీటి సౌకర్యం కల్పించడంతో పాటు వ్యవసాయ రంగానికి కొత్త ఊపిరి లభిస్తుందని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు ప్రాంతీయ అభివృద్ధికి, రైతుల ఆర్థిక పురోగతికి కీలకంగా మారనుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టు పూర్తి చేయడానికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ అవసరమైన అన్ని చర్యలు చేపడుతోందని మంత్రులు వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, సబ్ కలెక్టర్, జిల్లా ఎస్పీ, ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులు, జిల్లా అధికారులు, మండల అధ్యక్షులు, జిల్లా కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు, సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు