PACS మణుగూరు కార్యాలయంలో రైతులకు అవగాహన కార్యక్రమం

కోఆపరేటివ్ యూనియన్ ఆధ్వర్యంలో, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రైస్ రీసెర్చ్ (IIRR) వారి సౌజన్యంతో PACS మణుగూరు కార్యాలయంలో రైతులకు అవగాహన కార్యక్రమం…..

Today9News ప్రతినిధి,D రమేష్, మణుగూరు

 రైతులకు పంట మార్పిడి విధానాలు, నేల పరీక్ష (సాయిల్ టెస్ట్) ప్రాముఖ్యత, సహకార సంఘాల సమర్థవంతమైన నిర్వహణ వంటి అంశాలపై నిపుణులు వివరంగా అవగాహన కల్పించారు. పంటల దిగుబడిని పెంచుకోవడానికి నేల పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలని, పంట మార్పిడి ద్వారా భూసారాన్ని కాపాడుకోవచ్చని సూచించారు. అలాగే నేల పరీక్ష చేసే పరికరాలను కూడా ఒక పది కిట్లు మణుగూరు సొసైటీకి అందజేశారు ఉత్సాహం ఉన్న రైతులు వచ్చి ఈ కిట్లను వాడుకొని వారి యొక్క నేలను పరీక్షించుకోవచ్చని తెలియజేశారు..

ఈ కార్యక్రమంలో PACS మణుగూరు చైర్మన్ శ్రీ కుర్రి నాగేశ్వరరావు గారు, DIC డిస్ట్రిక్ట్ ఇంచార్జి రాజయ్య గారు,dr కవిరాజు, domanik ఎక్స్పర్ట్ అరుంధతి గారు, వ్యవసాయ విస్తరణ అధికారి (AEO) లక్ష్మణ్ రావు గారు, PACS మణుగూరు సీఈఓ కొంపెళ్లి సునీల్ , సిబ్బంది గుంటుపల్లి రాఘవులు మరియు పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొని పంటల నిర్వహణ, నేల ఆరోగ్యం, సహకార సంఘాల ద్వారా రైతులకు లభించే ప్రయోజనాలపై అవగాహన పొందారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు