భద్రాచలం రామాలయం ఆస్థాన పురోహిత నియామకంలో అన్యాయం జరిగింది..

వైదిక బ్రాహ్మణ సమాజం ఉసురుపోసుకున్న దేవాదాయ శాఖ.అంటూ తీవ్ర స్థాయితో నిరశన వ్యక్తం చేసిన బ్రాహ్మణ పురోహిత సంఘం…

రామాలయం ప్రాంగణంలోని ఆంజనేయ స్వామికి తమకు న్యాయం చేయమంటూ దరఖాస్తును సమర్పించి, ఆ దరఖాస్తును ఈవో కార్యాలయంలో అందజేసిన పురోహితులు.

జూలై 17 భద్రాచలం….

భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో ఆస్థాన పురోహితునిగా వైదిక బ్రాహ్మణ సమాజానికి చెందిన వారు వందల సంవత్సరాలుగా ఆస్థాన పురోహితుని బాధ్యతలు నిర్వర్తిస్తున్నారని,. రామాలయంలో ఆస్థాన పురోహితులు రిటైరై సుమారు నాలుగు4 సంవత్సరాలు అవుతోంది రిటైర్ అయినప్పటి నుండి ఆస్థాన పురోహితుని పోస్టు భక్త రామదాసు గారి కాలం నుండి ఆనవాయితీగా వైదిక బ్రాహ్మణుల నే నియమించడం జరుగుతూ వస్తోందని భద్రాద్రి పురోహిత సంఘం ఒక ప్రకటనలో తెలియజేసింది ,

ఆనవాయితీ ప్రకారం ఈసారి కూడా ఆస్థాన పురోహితునిగా వైదిక బ్రాహ్మణులనే ఎంపిక చేయాలని రామాలయం ఈవో నుండి దేవాదాయ కమీషనర్, ప్రిన్సిపల్ సెక్రటరీ, దేవాదాయ శాఖ మంత్రి,, ముఖ్యమంత్రి వరకు అనేక రూపాలలో విజ్ఞప్తులు చేయడం జరిగిందని, న్యాయం జరగకపోవడంతో హైకోర్టును ఆశ్రయించడం జరిగిందని గాయత్రి బ్రాహ్మణ సంఘం రాష్ట్ర అధ్యక్షులు రామావఝల రవికుమార్ తెలియజేశారు.

ఈవివాదం న్యాయస్థానంలో ఉన్నదని కాబట్టి ఆస్థాన పురోహిత పోస్టు నియామకం నిలుపుదల చేయాలని పైన తెలిపిన వారికి లిఖితపూర్వక విజ్ఞప్తులు చేయడం జరిగిందన్నారు .ఇదిఇలా ఉండగా గత నాలుగేళ్లుగా ఎన్ని విజ్ఞప్తులు చేసినప్పటికీ జూలై 16వ తేదీ ఇచ్చిన నియామక ఉత్తర్వులలో ఆస్థాన పురోహితుని పోస్టు గత ఆనవాయితీ ప్రకారం వైదిక బ్రాహ్మణులకు కేటాయించకుండా దేవాదాయ శాఖ వారు వైదిక బ్రాహ్మణ సమాజం ఊసురుపోసుకున్నారని, దీంతో లక్షలాదిమంది వైదిక బ్రాహ్మణ సమాజం వారు తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారని గాయత్రీ బ్రాహ్మణ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు రామావఝల రవికుమార్ భద్రాద్రి బ్రాహ్మణ పురోహిత సంఘం ప్రధాన కార్య దర్శి పవన్ కుమార్ శర్మ తెలిపారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి వెంటనేస్పందించి ఆస్థాన పురోహిత నియామకం నిలుపుదల చేసి గత ఆనవాయతీ ప్రకారం వైదిక బ్రాహ్మణ సమాజానికి చెందిన సమర్ధుడైన పౌరోహితుని నియమించాలని భద్రాద్రి బ్రాహ్మణ పురోహిత సంఘం వారు డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో అశోక్ కుమార్ శర్మ, సత్యప్రసాద్ శర్మ, సుందర రామ శాస్త్రి, కదంబరి కృష్ణ శర్మ, బుక్కపట్నం. తేజాచార్య, రాజా శర్మ, శ్రీరామ్ శర్మ తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు