మా గుప్పెట్లోనే శాఖలన్నీ… అన్న ధీమా వెనుక ఎవరి అండ?

జులై18 (TODAY9):

పాల్వంచ శివారులోని శ్రీ వెంకటేశ్వర క్రాకర్స్ వ్యవహారం వివాదాస్పదంగా మారింది. అనుమతులకు మించి బాణాసంచా నిల్వలు, ప్రభుత్వ భూమిలో వ్యాపారం, నిబంధనలకు విరుద్ధంగా కార్యకలాపాలు సాగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. యాజమాన్యం “అన్ని శాఖలు మా గుప్పెట్లోనే ఉన్నాయి” అంటూ ధీమాగా మాట్లాడుతున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు.

ఈ వ్యవహారంపై స్పందించిన తహసీల్దార్ దారా ప్రసాద్, సర్వే రికార్డులు పరిశీలించి వాస్తవాలు నిర్ధారించిన తర్వాత చర్యలు తీసుకుంటామని తెలిపారు. టౌన్ ఎస్సై నాగరాజు మాట్లాడుతూ, తనిఖీల్లో క్రాకర్స్ తయారీ గుర్తించలేదని, అయితే నిబంధనలకు విరుద్ధమైన కార్యకలాపాలు తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

ఇటీవల జరిగిన కాకినాడ పేలుడు ఘటన నేపథ్యంలో, పాల్వంచలో కూడా రెవెన్యూ, పోలీసు, అగ్నిమాపక శాఖలు సంయుక్తంగా సమగ్ర తనిఖీలు నిర్వహించి వాస్తవాలను వెలికితీయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు