ఆదివాసి మహిళలపై ఫారెస్ట్ అధికారుల దౌర్జన్యం ఖండించాలి …ఆదివాసీ సేన

పొలాల్లో పనిచేస్తున్న మహిళలపై చేసిన అమానుష దాడిని ఖండించండి. బీఆర్ఎస్ ఆదివాసి సేన రాష్ట్ర నాయకులు కోరం వెంకటేశ్వర్లు,,,, గణేష్

కొత్త గూడెం జులై 18(TODAY 9)

అశ్వాపురం మండలంలోని మనుబోతుల గ్రామ పరిధిలో పొలాల్లో పనిచేస్తున్న ఆదివాసి మహిళలపై ఫారెస్ట్ అధికారులు శనివారం ఉదయం విచక్షణా రహితంగా ఫారెస్ట్ అధికారులు దాడికి పాల్పడ్డ ఘటనను ఆదివాసి సేన రాష్ట్ర నాయకులు కోరం వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో ఖండించారు .
ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్నికల ప్రచారంలో సభలు సమావేశాలు ఏర్పాటు చేసిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి రాగానే నిర్మించిన ప్లాంటేషన్లు ఎవరి భూమి వారుసాగు చేయొచ్చునని అన్నారని,పోడు భూములకు అటవీ హక్కు పత్రాలు రాని రైతులందరికీ అటవీ హక్కు పత్రాలు సర్వేచేయించి అందజేస్తామన్నారని గుర్తు చేశారు …


కాగా అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు కావస్తున్న ఇచ్చిన మాట మర్చిపోయారని విమర్శించారు ఫారెస్ట్ అధికారులు పోడుభూమి రైతులపై ముఖ్యంగా ఆదివాసులపై దౌర్జన్యాలు, దాడులు చేస్తూ ఉంటే చోద్యం చూస్తూ నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు .ఈ విషయంలో ప్రజలు, ప్రజాస్వామిక వాదులు ఫారెస్ట్ అధికారుల దౌర్జన్యాలను ఖండించాలని పిలుపునిచ్చారు …

మనుబోతులు గూడెం గ్రామంలో పొలాల్లో పనిచేస్తున్న ఆదివాసి మహిళ అని కూడా చూడకుండా,విచక్షణారహితంగా దాడులు చేయడమే కాకుండా ఒక మహిళ మెడ విరిచారని, ఈ దుశ్చర్యకు పాల్పడ్డ ఫారెస్ట్ అధికారుల ను విధుల నుండి సస్పెండ్ చేసి వారిపై వెంటనే కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు . కేంద్రంలో బిజెపి ప్రభుత్వానికి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణపాఠం చెప్పే రోజులు తొందరలోనే ఉన్నాయని, ఆదివాసి సంఘం నాయకులు జోస్యం చెప్పారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు