నిరుద్యోగ గిరిజన యువతి యువకులు వృత్తి నైపుణ్య శిక్షణలు తీసుకొని జోనోపాధి పెంపొందించుకోవాలి..

ఐటీడీఏ పీవో బి.రాహుల్..

భద్రాచలం : Today 9 : D Vinesh భద్రాద్రి డివిజన్ ప్రతినిధి….

   నిరుద్యోగులైన గిరిజన యువతీ యువకులు పై స్థాయి వరకు చదువుకొని ఇంటిపట్టునే ఉండి ఖాళీగా ఉండకుండా అంది వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వృత్తి నైపుణ్యాలు పెంపొందించుకొని జీవనోపాధికి వెసులుబాటు కల్పించుకోవాలని ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ అన్నారు.

బుధవారం నాడు ఐటిడిఏ ప్రాంగణంలోని 
గిరిజన భవనంలో "వరల్డ్ స్కిల్ డే" సందర్భంగా నిరుద్యోగ గిరిజన యువతీ యువకులకు వివిధ స్వయం ఉపాధి పథకాలపై నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని రంగాలలో మహిళలు పురుషులతో సమానంగా దూసుకుపోతున్నారని, మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రతి యువతి, యువకులు చెడు భావాలను మనసులో నుండి తీసేసి మార్పు చెంది వృత్తి నైపుణ్యాలు పెంపొందించుకోవాలని, నైపుణ్యాలు నేర్చుకుంటే ఏ సంస్థలోనైనా కష్టపడి పనిచేసి కుటుంబాన్ని పోషించుకోవచ్చని అన్నారు. 


కష్టపడి పని చేస్తే తప్పనిసరిగా ప్రతి మనిషికి విలువ పెరుగుతుందని,వృత్తి నైపుణ్యాలు పెంపొందించుకొని ముందుకు పోతున్న దేశాలలో చైనా జపాన్ దక్షిణ కొరియా రాష్ట్రాలు ముందుకు పోతున్నాయని, ప్రపంచ దేశాలకు పోటీపడి మనం కూడా ముందుకు పోవాలని, పీజీ, బీటెక్, చేసిన యువతీ, యువకులు స్కిల్ డెవలప్మెంట్ పెంపొందించుకొని వివిధ ప్రభుత్వ ప్రైవేటు రంగాలలో పనిచేస్తూ జీవనోపాధి కల్పించుకుంటున్నారని, మన రాష్ట్రంలో ఉన్న యువతీ, యువకుల కొరకు స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నారని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగం అనేది ఈ పోటీ ప్రపంచంలో సాధించాలంటే ఎంతో శ్రమించాలని, ప్రభుత్వ ఉద్యోగం నోటిఫికేషన్లు వచ్చేవరకు ప్రతి ఒక్కరు ఐటీడీఏ భవిత సెల్లు ద్వారా నిర్వహించే వివిధ రకాల వృత్తి శిక్షణలో తర్ఫీదు పొంది శిక్షణ తీసుకొని స్వయం ఉపాధి ద్వారా జీవనోపాధి పొంది ఆర్థిక వెసులు బాటు కల్పించుకొని ఉపాధి అవకాశాలు పెంపొందించుకోవాలని ఆయన అన్నారు 
   రాష్ట్రంలో ఉన్న నాలుగు ఐటీడీఏలకు రాష్ట్ర ప్రభుత్వం గిరిజన యువతి యువకులకు వివిధ రకాల శిక్షణలు అందించి ఉపాధి అవకాశాలు కల్పించడానికి ప్రతి ఐటీడీఏకు 2500 మంది నిరుద్యోగ యువతీ యువకులకు వివిధ రకాల శిక్షణలు అందించాలని ఆదేశాలు జారీ చేసినందున గిరిజన యువతి యువకులకు వారికి ఇష్టమైన కోర్సులలో శిక్షణ తీసుకోవడానికి అశ్వరావుపేట, ఇల్లందు, ఖమ్మం, భద్రాచలం వైటీసీలలో ప్రస్తుతం 570 మందికి వివిధ రకాల శిక్షణలు అందిస్తున్నామని అన్నారు. యువతీ యువకులు మీరు శిక్షణ తీసుకోవడమే కాక మీ గ్రామంలోని తోటి నిరుద్యోగ గిరిజన యువతి యువకులకు అవగాహన కల్పించి శిక్షణలు తీసుకునేలా ప్రోత్సహించాలని శిక్షణ సమయంలో పూర్తి ఉచిత భోజన వసతి సౌకర్యాలతో పాటు శిక్షణకు సంబంధించిన మెటీరియల్ యూనిఫార్మ్స్ అందిస్తున్నామని అన్నారు. అలాగే శిక్షణ పూర్తయిన యువతీ యువకులకు ప్రభుత్వ ప్రైవేటు రంగాలలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని అన్నారు.

  ఎంబ్రాయిడరింగ్ మరియు టైలరింగ్ శిక్షణ తీసుకున్న 30 మంది యువతులకు సర్టిఫికెట్లు మరియు తమిళనాడులో ఐటీ లో జాబ్ చేయడానికి ముందుకు వచ్చిన యువకులకు జాబ్ ఆర్డర్స్ మరియు యూనిఫార్మ్స్ శిక్షణ మెటీరియల్స్ అందించారు

  ఈ కార్యక్రమంలో సహాయ ప్రాజెక్టు అధికారి జనరల్ డేవిడ్ రాజ్, పిఈటిసి ప్రిన్సిపాల్ డాక్టర్ వీరు నాయక్, జేడీఎం హరికృష్ణ, వై టి సి ఇంచార్జ్ శ్రీనివాస్, ఇన్స్ట్రక్టర్లు జ్యోతి, ఎండి అప్రిన్, రజియా బేగం, బాధావత్ సంధ్య భవిత సెల్ సిబ్బంది సమ్మయ్య, కౌన్సిలింగ్కు వచ్చిన గిరిజన యువతి యువకులు పాల్గొన్నారు. 

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు