ఖమ్మం పట్టణంలో జరిగే రాయల చంద్రశేఖర్ రెండో వర్ధంతి సభను జయప్రదం చేయాలి .
CPIML మాస్ లైన్ పార్టీ రాష్ట్ర సెక్రటేరియట్ సభ్యులకు రంగారెడ్డి
రాయల చంద్రశేఖర్ భద్రాచలం డివిజన్ కమిటీ ఘనంగా నివాళి .
భద్రాచలం.…. జులై 15: D Vinesh : భద్రాద్రి డివిజన్ ప్రతినిధి…
దేశంలో పాలకులు మారుతున్నారు రైతుల జీవితాలు మారటం లేదని అలాంటి రైతాంగం కోసం ఆహార్నిశలు శ్రమించి వారి హక్కుల కోసం జీవితాన్ని త్యాగం చేసిన ఆదర్శ రైతుల పక్షపాతి అమరుడు రాయల చంద్రశేఖర్ రెండో వర్ధంతి సభ భద్రాచలం డివిజన్ పార్టీ ఆఫీసులో జరిగింది. ఈసభలో సిపిఐ ఎంఎల్ ప్రజాపంథా రాష్ట్ర సెక్రటేరియట్ సభ్యులు Kరంగారెడ్డి మాట్లాడుతూ, కామ్రేడ్ రాయల చంద్రశేఖర్ రైతాంగ ఉద్యమంలో అఖిలభారత స్థాయి నాయకుడిగా ఉత్తర దేశ పర్యటన చేశారని. చరిత్రక మైన ఢిల్లీ సరిహద్దులో కొనసాగిన రైతాంగ పోరాటంలో పాల్గొని మూడు నల్ల చట్టాలను రద్దు చేసేంతవరకు చంద్రశేఖర్ పోరాటంలో కొనసాగారని అన్నారు.

ఎమర్జెన్సీ అనంతరం సిపిఎంఎల్ పార్టీ ఇచ్చిన పిలుపుని అందుకొని రైతు కూలీ సంఘం ఖమ్మం జిల్లా అధ్యక్షునిగా. రాష్ట్ర నాయకుడిగా సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్ కేంద్ర కంట్రోల్ కమిషన్ చైర్మన్ గా,స్థాయికి ఎదిగిన నాయకుడు మన మధ్య నుండి దూరం కావడం పార్టీకి తీరని నష్టమని అభిప్రాయపడ్డారు.ఈనెల16న పార్టీ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఖమ్మం రామ నరసయ్య విజ్ఞాన కేంద్రంలో సంతాప సభ జరుగుతుందని దీనిని జయప్రదం చేయాలని,పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ జిల్లా కల్పనక్క, దాసరి సాయన్న, మునిగేలా శివ ప్రశాంత్, ప్రణయ్ , శాంతక్క, సరళ, తదితరులు పాల్గొన్నారు.
Post Views: 19









