హైకోర్టు చెప్తేనే పని చేస్తారా?

రెవెన్యూ శాఖ అధికారులపై తెలంగాణ హైకోర్టు అసహనం

హైకోర్టు చెప్తేనే పని చేస్తారా? అంటూ రెవెన్యూ శాఖ అధికారులపై తెలంగాణ హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది…తన 20 గుంటల భూమిని ఆర్డీవో, తహసీల్దార్ మ్యుటేషన్ చేయడంలేదని నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం ఎరాజ్ పల్లె గ్రామానికి చెందిన లో కనడిపి హనుమాండ్లు అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో హైకోర్టు ఈ పిటిషన్ విచారిస్తూ ప్రజలు అప్లికేషన్లు పెట్టుకుని నెలలు గడుస్తున్నా భూ సర్వేలు చేయకపోవడం, మ్యుటేషన్లు చేయకపోవడం, పాస్ పుస్తకాలు జారీ చేయకపోవడం లాంటి ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయన్నది.పాస్ పుస్తకాల కోసం 3 నెలలు, భూ సర్వే కోసం 6 నెలల సమయం పడుతుందా?అధికారుల చుట్టూ తిరిగి తిరిగి విసుగు చెందిన ప్రజలు హైకోర్టుకు వస్తున్నారని వ్యాఖ్యానించింది హైకోర్టు చెప్పకపోతే మీ పని మీరు చేయలేరా? అని ప్రశ్నిస్తూ ఈ అంశంపై కౌంటర్ దాఖలు చేయాలని రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశించింది. అనంతరం కేసును నాలుగు వారాలకు వాయిదా వేసింది

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు