స్టేటస్ కో ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ హైకోర్టు…
సల్కం చెరువులోని ఒవైసీ విద్యాసంస్థల భవనాన్ని కూల్చివేయకండి అంటూ తెలంగాణ హైకోర్టు స్టేటస్ కో ఉత్తర్వులు జారీ చేసింది.ప్రస్తుతం వివాదంలో ఉన్న తమ విద్యాసంస్థల భవనాన్ని కూల్చడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఒవైసీ విద్యాసంస్థల యాజమాన్యం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో హైకోర్టు స్టేటస్ కో ఉత్తర్వులు జారీ చేసింది. అయితే భవనం సల్కం చెరువు ఎఫ్‌టీఎల్‌లో ఉందని, మరో ధర్మాసనం ఎదుట విచారణ జరుగుతుందని, ఈ పిటిషన్ విచారణకు అర్హత లేదని ప్రభుత్వం తరపు న్యాయవాది వాదించారు.కాగా భవనం క్రమబద్ధీకరణ కోసం బిల్డింగ్ రెగ్యులరైజేషన్ స్కీం(బీఆర్ఎస్) కింద దరఖాస్తు చేసుకున్నారు కాబట్టి, భవనంపై స్టేటస్ కో విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ హైకోర్టు తదుపరి విచారణను ఆగస్టు 3వ తేదీకి వాయిదా వేసింది….
Post Views: 33









