అడ్వకేట్ మొయిజుద్దీన్ హత్య కేసులో కీలక పరిణామం….

హైదరాబాద్ కు చెందిన అడ్వకేట్ మొయిజుద్దీన్ హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.ఈ కేసులో కాంగ్రెస్ నేత ఆలం ఖాన్‌తో పాటు అతని కుమారుడని పోలీసులు అరెస్టు చేశారు.

మొయిజుద్దీన్‌ను చంపేందుకు,అలం ఖాన్, అతని కుమారుడు 25 లక్షలు సుపారీ ఇచ్చినట్టు పోలీసుల దర్యాప్తులో తేలడంతో వీరిని అరెస్ట్ చేశారు.

రెండేళ్లుగా మొయిజుద్దీన్‌ను హత్య చేసేందుకు ప్రయతినిస్తున్నట్టు,అందులో భాగంగా పదిసార్లు హత్య చేసేందుకు ప్రయత్నించినట్టు నిందితులు విచారణలో వెల్లడించారు.

సీనియర్ న్యాయవాది ఖాజా మొయిజుద్దీన్ హత్య కేసులో ప్రధాన నిందితులైన కాంగ్రెస్ నాయకుడు ఆలం ఖాన్‌ అతని కుమారుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ కుట్రలో పాలుపంచుకున్న మొత్తం ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు.

ఇది ఇలా ఉంటే మా నాన్నపై దాడి జరగడం ఇది ఆరోసారి మా నాన్న హత్యకు కారణం కాంగ్రెస్ నాయకుడు ఆలం ఖానే అంటూ మొయినుద్దీన్ కొడుకు ఆరోపించిన సంగతి తెలిసిందే.వక్ఫ్ బోర్డు ఆస్తులను ఆలం ఖాన్, అతడి తండ్రి ఆక్రమించి కాలేజీలు నిర్మించారని, వాటి గురించి ఎప్పటినుండో కేసులు వేస్తూ.. మా ఫాదర్ ఖాజా మోహిజుద్దీన్ పోరాటం చేస్తున్నారన్నారు. గత ఆరు నెలల క్రితం అలంఖాన్ మా ఆఫీసుకు వచ్చి నన్ను బెదిరించాడని వెల్లడించారు.గతంలో మా ఆఫీసులకు వచ్చి మరీ దాడులు చేశారు.ఇప్పుడు నాకు గాని మా కుటుంబానికి కానీ ఏం జరిగినా ఆలం ఖాన్ దే బాధ్యత అంటూ మొయిజుద్దీన్ కొడుకు ఫర్హాన్ ఆరోపించిన విషయం విదితమే …

కాగా హత్య జరిగిన నాటి నుండి దర్యాప్తును వేగవంతం చేసిన పోలీసులు గత కొద్ది సేపటి క్రితం నిందితులను అదుపులోకి తీసుకున్నారు…

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు