పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయిన బండి భగీరథ్‌..!

POCSO కేసు నమోదైనప్పటి నుంచి పోలీసులకు చిక్కుకుండా తిరిగిన భగీరథ్ శనివారం సరెండరయ్యాడు. న్యాయవాదుల సమక్షంలో కుటుంబసభ్యులు ఆయనను పేట్ బషీరాబాద్ పోలీసులకు అప్పగించారు.

ఇది ఇలా ఉండగా తన కొడుకు భగీరథ్ తన దగ్గరే ఉన్నాడని ఒప్పుకొని పోలీసులకు న్యాయవాదులతో పోలీసులకు అప్పగించిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి . తమ కొడుకు బండి భగీరథ్ పై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఈరోజు అడ్వోకేట్ల ద్వారా పోలీసుల విచారణ కోసం అప్పగించానన్నారు. వాస్తవానికి POCSO కేసులో ఫిర్యాదు రాగానే అతన్ని స్టేషన్లో అప్పగిద్దామనుకున్నానని, లాయర్లను సంప్రదించి మా వద్ద ఉన్న ఆధారాలను వారి ముందుంచామన్నారు. వాటిని చూసి కేసు కొట్టేస్తారని, బెయిల్ తప్పకుండా వస్తుందని తమ లాయర్లు చెప్పారని ,అందుకే కొంత ఆలస్యంగా అప్పజెబుతున్నానన్నారు. ఈరోజు కూడా బెయిల్ వస్తుందనే లాయర్లు చెబుతున్నారు అయితే ఇంకా జాప్యం చేయడం సరికాదనే ఉద్దేశంతో నేను మా అబ్బాయిని తీసుకొచ్చి పోలీసులకు లాయర్ల ద్వారా విచారణ కోసం అప్పగించానన్నారు సంజయ్.

చట్టంపై ఉన్న గౌరవంతోనే తన కుమారుడు బండి భగీరథ్‌ను పోలీసులకు అప్పగించినట్లు కేంద్ర మంత్రి బండి సంజయ్‌ స్పష్టం చేశారు. చట్టం ముందు తన బిడ్డ అయినా, సామాన్యుడైనా ఒకటేనని, అందరూ చట్టానికి లోబడి ఉండాల్సిందేనని ఆయన అన్నారు. తన కుమారుడు ఏ తప్పూ చేయలేదని పదేపదే చెబుతున్నాడని.. వాస్తవానికి ఫిర్యాదు అందిన వెంటనే పోలీస్ స్టేషన్‌లో అప్పగించాలని భావించానని బండి సంజయ్ పేర్కొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు