ఆదివాసి న్యాయ కళాశాల ఏర్పాటుకై .వాజేడు లో జరిగే ఆదివాసి గర్జన సదస్సును జయప్రదం చేయండి.

.

చర్ల మండల కేంద్రంలో జిఎస్పి ముఖ్య కార్యకర్తల సమావేశం కలం. శ్రీను అధ్యక్షతన జరిగిన సమావేశంలో జి.ఎస్.పి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పూనెం.వరప్రసాద్ పాల్గొని ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భద్రాచలం కేంద్రంగా ఆదివాసి న్యాయ కళాశాల ఏర్పాటు చేయాలని,ఆయన డిమాండ్ చేశారు. న్యాయ కళాశాల వలన ఆదివాసి యువత ఆదివాసి చట్టాలపై ఆదివాసి భూములకు రక్షణగా ఉంటారని, ఆదివాసిట్టాలపై అవగాహన పెంచుకుంటారని ఆయన అన్నారు ఏజెన్సీ ప్రాంతంలో నీచమైన రాజకీయ పార్టీలను బహిష్కరించాలని రాజకీయ పార్టీల వాళ్ళనే ఆదివాసి చట్టాలు అమలు కాకుండా అడ్డుపడేది రాజకీయ పార్టీలని ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు భద్రాచలం కేంద్రంగా ఆదివాసి న్యాయ కళాశాల ఏర్పాటు చేయాలని మే 24న వాజేడు మండల కేంద్రంలో జరగబోయే ఆదివాసి గర్జన సదస్సును ఆదివాసీలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు పార్లమెంటు చట్టాలైన 1/70.పిసా చట్టాలను ఏజెన్సీ ప్రాంతంలో వలస గిరిజనేతరులు తూట్లు పొడుస్తున్నారని ఆ చట్టాలను రెవెన్యూ అధికారులు ఎందుకు అమలు చేయలేకపోతున్నారని ఆయన సూటిగా ప్రశ్నించారు 1/70.పిసా చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు ఆదివాసి చట్టాలను పటిష్టంగా అమలు చేయని అధికారులను మైదాన ప్రాంతానికి వెంటనే బదిలీలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు భద్రాచలం కేంద్రంగా ఆదివాసి న్యాయ కళాశాల ఏర్పాటు చేయాలని ఆదివాసి ఎమ్మెల్యేలందరూ అసెంబ్లీలో తీర్మానం చేయాలని ఆయన ఈ సందర్భంగా కోరారు ఈ సమావేశంలో ఇర్ప. నాగేంద్ర బాబు సప్కా. సాగర్ కోరం. వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు